ప్రేమ.. నిర్వచించలేని ఒక అనుభూతి. పదాల్లో కూర్చలేని ఒక భావం. ప్రేమికులిద్దరూ కలిసున్నంత వరకూ ప్రపంచమంతా అందంగా, ఇంత అందమైన ప్రపంచం తమ కోసమే దేవుడు సృష్టించాడు అన్నంత ఆనందంగా ఉంటారు.మరి ఏదైనా కారణాల వల్ల విడిపోతేనో..!! ఆ బాధ చెప్పనలవి కానిది. తినడానికైనా, తాగడానికైనా, మట్లాడ్డానికైనా గొంతుకడ్డం పడే బాధ అది. ఇక నిద్ర సంగతంటారా.. అదెలా ఉంటుందో కొద్ది రోజుల వరకూ గుర్తు కూడా రాదు. మరి అటువంటి బాధకి అక్షర రూపం ఇవ్వడం మామూలు విషయం కాదు. నిన్నటి దాకా నిచ్చెలి చేతుల్లో చెయ్యేసి పక్క పక్కనే నడుస్తూ జీవితాన్ని రంగుల్లో ఊహించుకుంటూ ఉండే ప్రియుడు, ఒక్క సారిగా తన చేతిలో సఖి చెయ్యి మాయం అయిందని తెలుసుకుని అది నిజమే అని తెలిసి కూడా, నిజమా కాదా అన్న సంఘర్షణలో ఉన్న తన మనసుకి సర్ది చెప్పలేక సతమతమయ్యే ఒక ప్రేమికుడి వ్యధ.. "బొమ్మరిల్లు" చిత్రం లోని ఈ "నమ్మక తప్పని నిజమైనా" పాట.ఇక ఇటువంటి భావాలని అక్షర రూపంలో పొందు పరచడం మన శాస్త్రి గారికి వెన్నతో పెట్టిన విద్యేమో.. ఆ బాధని మన మనసు మూలాల్లోకి తీసుకెళ్లిపోతాడు. ఒకానొక క్షణంలో మన కళ్లలో నీటి తెర అడ్డు పడటం అన్నది చాలా సాధారణ విషయం (ఎన్నో పాటల్లో నాకు అనుభవానికొచ్చింది).
నువ్విక రావు అన్న నమ్మలేని నిజాన్ని చెబుతూ ఉన్నా ఎందుకు వినదో నా మనసు.. నువ్వొస్తావు అన్న పిచ్చి ఆశతో ఎదురు చూస్తూనే ఉంటుంది. ఎదురుగా ఎవరొస్తున్నా అది నువ్వే అన్న ఆశ. మరి నీ రూపం నా చూపులనొదిలి వెళ్లలేదుగా. నువ్వు లేని ఈ ఏకాంతంలో ఇంకెంత మంది ఉన్నా నేను ఒంటరినే కదా.. నన్ను ఇటువంటి ఒంటరితనంలో వదిలి వెళ్లావు కదూ.. నువ్వు నిన్నటి కలవే అని తెలుసు. అయినా, కన్నులు తెరిచుకుని అదే (నీ) కలలో ఉన్నాను ఇప్పటికీ. మరి నువ్వు నన్ను వదిలి వెళ్లినంత మాత్రాన నీ ఙ్ఞాపకాల్ని నేను మర్చిపోలేను కదా..
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెపుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చుపులనొదిలేనా
ఎందరితో కలిసున్నా నే నొంటరిగానే ఉన్నా
నువ్వొదిలిన ఈ ఏకాంతంలొనా
కన్నులు తెరిచే ఉన్నా నువు నిన్నటి కలవే ఐనా
ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా
"ఈజన్మంతా విడిపోదీ జంటా అని దీవించిన గుడిగంటను ఇక నామది వింటుందా" ఎంత గొప్పగా రాసారో.. ఇద్దరం కలిసి తిరిగిన ఏ చోటైనా నువ్వు లేని నన్ను గుర్తు పడుతుందా.. వాహ్.. నీ ప్రేమ గుర్తులతో నన్ను నిలువునా తడిమి.. ఙ్ఞాపకాలను మాత్రం వదిలి వెనుదిరిగావు. నీ వియోగంతో చెమర్చిన ఈ కనులతో నిన్ను ఎలా వెతికేది..
ఈజన్మంతా విడిపోదీ జంటా
అని దీవించిన గుడిగంటను ఇక నామది వింటుందా
నా వెను వెంట నువ్వే లేకుండా
రోజూ చూసిన ఏ చోటైన నను గుర్తిస్తుందా
నిలువున నను తడిమిఅలా వెనుదిరిగిన చెలిమి అలా
తడి కనులతో నిను వెదికేది ఎలా
కానీ ఇక నువ్వు రావు అన్నది నిజం. మరి, నిరంతరం వెలిగే వెన్నెల లాంటి నీ స్నేహంలో కనీసం కొన్ని రోజులు సంతోషంగా గడిచాయి అని ఆనందించమంటావా.. లేదా నువ్వు రావన్న నిజాన్ని తలుచుకుంటూ నా ఊహల్లో కలిగే వేదన చీకటిలో జీవితం గడిచిపోతుంది అనుకోవాలా..చిరునవ్వులతో పరిచయమై ఎన్నటికీ మరచిపోలేని సిరిమల్లెల పరిమళాన్ని అందించి చేజారిపోయావు.. నా ఆశల తొలి వరానివి. వాహ్. ఎంత అద్భుతంగా రాసారో..
నీ స్నేహంలొ వెలిగే వెన్నెల్లో
కొనాళ్ళయినా సంతోషంగా గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో
ఎనాళ్ళైనా ఈ నడి రాతిరి గడవదు అనుకోనా
చిరు నవ్వుల పరిచయమా సిరి మల్లెల పరిమళమా
చేజారిన ఆశల తొలి వరమా...
Youtube link : http://www.youtube.com/watch?v=62W-xiJABTQ&feature=related
Tuesday, November 30, 2010
Thursday, November 25, 2010
పుటుక్కు జర జర డుబుక్కు మే
"పుటుక్కు జర జర డుబుక్కు మే.. " ఎక్కడో విన్నట్లు ఉంది కదూ.. ఈ వాక్యం గురించి ఏదో చిత్రంలో ప్రకాష్‌రాజ్ మాట్లాడతాడు. ఈ వాక్యానికి చాలా పెద్ద అర్థం చెబుతాడు. కానీ నాకు ఈ వాక్యం వినగానే మాత్రం గుర్తొచ్చేది "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" చిత్రం లోని "పారిపోకే పిట్టా" పాట.మన అందరికీ తెలిసిన విషయమే.. సీతారామ శాస్త్రి గారు అతి సులువైన, అందరికీ అర్థమయ్యే పదాలతో ఎంత గొప్ప భావాన్నైనా పలికించగలరని. ఈ పాటని కూడా అలాగే చాలా సులువైన పదాలతో అర్థవంతంగా రాశారు.
తన ప్రియురాలికి దూరమై ఎలాగైనా చెలి చెంతకి చేరుకోవాలని సంకల్పంతో చేసే ప్రయాణంలో ఉన్న ఒక ప్రియుడి ఆరాటం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ పాటలో మనకి. నాకు ఈ పాట వింటూంటే నిజంగా దోసెడు విరజాజుల్ని తెచ్చి ముద్దగా మాలకట్టినట్లుగా అనిపిస్తుంది. అంత అందమైన పదాల అల్లిక ఈ పాట. ఇందులో ఎక్కువగా ఆకర్షించిన పాత్ర ప్రభుదేవాది. ప్రియుడి కబురుని ప్రియురాలి చెంతకు చేర్చమని రకరకాల పక్షులకి విన్నవిస్తాడు.
పాట మొదలుపెట్టడమే పారిపోయే పిట్టతో మొదలు పెడతారు. పారిపోయే ప్రేమ పిట్టను పారిపోవద్దని చాలా గారంగా బ్రతిమాలుతూ చెంతకు చేరకపోతే ఎలా అని గద్దిస్తూ.. మజిలీ చేర్చవా, నీ వెంటే వస్తాగా అంటూ.. చాలా నచ్చింది నాకు ఈ పల్లవి.
పారిపోకే పిట్టా.. చేరనంటే ఎట్టా
అంత మారాం ఏంటంట మాట వినకుండా
సరదాగా అడిగాగా మజిలీ చేర్చవా
తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట..
అనుకోని పరిస్థితుల్లో ప్రేమికులు ఇద్దరూ దూరమైనప్పుడు ఎవ్వరూ సంతోషంగా ఉండరు. విచిత్రం ఏమిటంటే, ఎవరికి వారు అవతలి వారు సంతోషంగా ఉంటే చాలు అని ఆశ పడుతూ ఉంటారు. ఇంత సున్నితమైన ప్రేమికుల మనస్తత్వాన్ని చాలా అందంగా వర్ణించారు సిరివెన్నెల. ప్రియుడు తన సంతోషాన్నంతా తన చెలితో పంపించాడట. ఇక్కడింకో చమత్కారం.. ప్రియుడి పేరు సంతోష్. తన సంతోషాన్నంతా ప్రియురాలి వెంట పంపించాడట ఆ సంతోష్. మరి తన చెలి ఆ సంతోషాన్ని భద్రంగా చూసుకుంటుందో లేదో అని బెంగ. చెలి సంతోషంగా ఉందో లేదో అన్న సందేహాన్ని ఇంత కన్నా అందంగా ఎవరూ వ్యక్త పరచలేరేమో అన్నంత అందంగా రాసారనిపించింది.
ప్రతి క్షణం ఎంతో సరదాగా నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే అతను, తన అల్లరిని, చిందర వందర సరదాని చెలి అందెలుగా తొడిగాడట. (తన అల్లరి తనకు దూరమై అతను ముభావంగా ఉన్నాడన్నది కనిపించే సత్యం.) మరి ఆ అందెల్ని ప్రతి రోజూ సందడిగా ఆడిస్తుందా లేదా అన్న సందేహం.కానీ ఇలా విడిపోయినప్పుడు ఆ ప్రేయసి మాత్రం సంతోషంగా అల్లరిగా ఎలా ఉండగలుగుతుందండీ..?? అదొక ఆశ అంతే..
నా సంతోషాన్నంతా పంపించా తన వెంట
భద్రంగానే ఉందా ఏ బెంగా పడకుండా
తన అందెలుగా తొడిగా నా చిందరవందర సరదా
ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా
ఇక్కడే సందేహాలకి సమాధానాలు కూడానూ.. చెలికొమ్మ చినబోయిందనుకుంటా.. ప్రియుడి కోసమే ఎదురు చూసే తన ప్రియురాలి గుండె గూటికి అతను వచ్చేస్తున్నాడని ముందు గానే కబురు చెప్పమంటూ చిలుకమ్మని వేడుకోవడం.. అతడు వచ్చేలోగా విన్న కథలన్నీ ఆ అమ్మాయికి చెప్పమని కాకమ్మని కోరడం..
చినబోయిందేమో చెలి కొమ్మ..
ఆ గుండెల గూటికి ముందే కబురీయవే చిలకమ్మా
నీ వాడు వస్తాడే ప్రేమా అని త్వరగా వెళ్లి
నువ్విన్న కథలన్నీ చెప్పమ్మా కాకమ్మా…
తీసుకుపో నీ వెంట..వస్తా తీసుకుపో నీ వెంట
ప్రేమలో ఉన్నా విరహంలో ఉన్నా ఆకలి నిద్దుర ఉండవట. ఇటువంటి ప్రయోగం చాలా పాటల్లో, కథల్లో, కవితల్లో చూసా కానీ ఇంత అందంగా అయితే ఎప్పుడూ చూడలేదు. ప్రియుడి దారిలో ఆకలి కనిపించిందట. అన్నం పెట్టను పోవే అని కసిరిందంటూ ప్రేయసి నిందించిందట. తన వద్దకు రావొద్దని తరిమేసినందుకు నిద్దుర చాలా చిరాగ్గా కనిపించిందట ప్రియుడికి.. నాకు ఈ ప్రయోగాలు ఎంత బాగా నచ్చాయో..
ఆకలి కనిపించింది…నిన్నెంతో నిందించింది
అన్నం పెట్టను పోవే అని కసిరేశావంది
నిద్దర ఎదురయ్యింది..తెగ చిరాగ్గ ఉన్నట్టుంది
తన వద్దకు రావద్దంటూ తరిమేశావంటుంది
ప్రేమా.. నిన్ను ఎదిరించే వాళ్లు, నువ్వడిగింది ఇవ్వని వాళ్లంటూ ఎవరూ లేరన్న సత్యం నీకు కూడా తెలుసు కదా.. మరి ఎందుకమ్మా ఇంత గారం చేస్తావు. నీ పంతం ముందు ఏ రోజైనా ఏ ఘనుడైనా గెలిచినట్లు చరిత్రలో లేదు కదా..
ఏం గారం చేస్తావే ప్రేమ
నువ్వడిగిందివ్వని వాళ్లంటూ ఎవరున్నారమ్మా
ఆ సంగతి నీకూ తెలుసమ్మా
నీ పంతం ముందు ఏనాడు ఏ ఘనుడు నిలిచాడో చెప్పమ్మా
తీసుకుపో నీ వెంట..
ఓ ప్రేమా తీసుకుపో నీ వెంట
తీసుకుపో నీ వెంట..తీసుకుపో నీ వెంట
Youtube Link : http://www.youtube.com/watch?v=MiQoDE6Jqjc

Tuesday, October 26, 2010
మమత కొలువులోని పెళ్లికి ఆహ్వానం..
పెళ్లంటే మామూలు పెళ్లి కాదు.. అనురాగాన్ని మంత్రంగా.. అనుబంధాన్ని సూత్రంగా చేసుకుని, మమతల కొలువులో జరుగుతున్న పెళ్లి.. అమ్మాయికి అత్తయ్యే దగ్గరుండి అమ్మలా జరుపుతున్న పెళ్లి.. ఆడకూతురు ఒక పైశాచిక మృగం చేతుల నుండి తప్పించుకుని, మరో ప్రేమమూర్తి హృదయంలోకి అడుగిడటానికి చేసుకుంటున్న పెళ్లి.. "పెళ్లి" చిత్రంలోని ఆ పెళ్లి సన్నివేశం ఎంత హృద్యంగా ఉంటుందో, కన్నులకు కట్టినట్లు చూపించింది దర్శకుడు కోడి రామకృష్ణ అయితే, దాన్ని మనసు లోపలి వరకూ చేరవేసింది మాత్రం ఖచ్చితంగా సిరివెన్నెలే..
అత్తా కోడళ్లు అంటే అదొక కత్తి మీద సాము లాంటి బంధంగా సృష్టించేశాం మనం. మరి ఇలా అత్తే ఒక తల్లిలా జరిపే పెళ్లి అయితే నా కంట పడలేదు. కానీ ఒకవేళ జరిగితే ఎలా ఉంటుందీ..?? ఇదిగో ఈ కింద ఉన్నంత అందంగా ఉంటుంది..:)
అనురాగం అనుబంధం కలగలిసి మమతల కొలువులో జరుపుతున్న పెళ్ళికి ఇచ్చే మంగళ వాయిద్యం ఇది.. విని తరించండి మరి..
అనురాగమే మంత్రంగా
అనుబంధమే సూత్రంగా
మమత కొలువులో జరుగు పెళ్ళికి
మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం(2)
పెళ్లంటే మూడు ముళ్లేనా.? ఏడడుగులేనా..? కాదు.. వాటికి అతీతంగా ఇంకేదో ఉంది.. ప్రపంచమంతా ఏకమై నిన్ను వెలేసినా నీకు నేనున్నానన్న నమ్మకాన్ని అందించడం.. అసలు మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ-రజ-తమో గుణాలకు సంకేతమట హిందూ సంప్రదాయం ప్రకారం..ఇక ఏడడుగులేమో వధూ వరులకి ఎన్నడూ విడిపోని స్నేహబంధాన్ని పెనవేస్తుందని మన గట్టి నమ్మకం. మూడు ముళ్లకి, ఏడు అడుగులకి మనం ఇచ్చిన గౌరవం అలాంటిది.. మరి, నాతిచరామి అని ప్రమాణాలు చేసిన అబ్బాయి, లేదా పుట్టిల్లు ఒక కన్ను, అత్తిల్లు రెండో కన్ను అని ఆ రెండిటి గౌరవం నిలబెడతా అని మాటిచ్చిన అమ్మాయి వాటిని నిలబెట్టుకోలేకపోతే (నిలబెట్టుకోకపోతే..) శిక్ష ఎవరికి..? ఈ చిత్రం విషయంలో మాత్రం తప్పు అబ్బాయిదే.. శిక్ష అమ్మాయికే.. కానీ తన దురదృష్టానికి ఆ ఆడకూతురు కృంగి పోలేదు.. పెళ్లి అంటే కేవలం మూడు ముళ్లే కాదు అని తెలుసుకోవడమే కాకుండా ప్రేమగా చేరువైన ఒక స్నేహ బంధాన్ని మరో ముడిగా జత చేసుకుంది. ఏడు అడుగులు వేసి అక్కడితో ముళ్లపొదలో ఆగిపోయిన తన జీవితానికి ప్రేమ అను ఎనిమిదో అడుగుతో మళ్లీ వసంతపు బాటల్ని పరుచుకుంది.. నాతిచరామి మంత్రానికి అర్థం తెలిసిన మనిషి అడుగుల్లో తన అడుగులు కలుపుకుంటూ, ఒక కొత్త రకపు వెలుగులతో నిండిన తన కొత్త జీవితపు పుటల్ని తెరుచుకుంటూ కదిలిపోయే సమయమట.. అంతే కాదు, ఇది ఆగని పయనమట.. అద్భుతం కదూ...
మూడు ముళ్ళతోనే పెళ్లి పూర్తి కాదు అని
మరో ముడిగ చేరుకున్న స్నేహ బంధమిది
సప్తపదితో ఆగరాదు జీవితం అని
అష్టపదిగ సాగమన్న ప్రేమ పదము ఇది
నాతిచరామి మంత్రములో అర్ధం తెలిసిన నేస్తముతో
అడుగు కలుపుతూ వెలుగు వెతుకుతూ సాగే సమయమిది
ఆగని పయనమిది.....
అనురాగమే మంత్రంగా..........
సాధారణంగా కొడుకు ఎంత కౄరుడైనా తల్లి గుండె తన పిల్లల కోసమే కొట్టుకుంటుంది. కానీ ఇక్కడ మాత్రం, కొడుకు పైశాచికత్వానికి కోడలు బలవ్వడం చూసి తనలోని నిజమైన మాతృత్వాన్ని తట్టి లేపిన ఒక తల్లి కనిపిస్తుంది.. కోడలి జీవితం బాగుండాలని జరిగిపోయిన మూడు ముళ్లు, ఏడు అడుగుల పెళ్లి అనబడు ఒక పీడ కలకి మరో ముడిని, మరో అడుగుని జత పరిచి ఒక కొత్త అంకాన్ని కోడలుకి ప్రసాదిస్తుంది..ఆడదంటే ఆడదానికి శతృవు కాదు, అత్త కూడా ఒక అమ్మే అని నిరూపిస్తుంది.. మరి జీవితమంటే బ్రహ్మ ఆడుకుంటున్న బొమ్మలాటేగా.. కానీ ఆ బ్రహ్మ రాతని కూడా మార్చి చూపిస్తుంది మన మానవత్వం. ఇంతవరకూ చరిత్రలో ఎక్కడా జరగని/చదవని మొదటి కథగా, కేవలం మూడు ముళ్ల బంధంలా కాకుండా మనసులు పెనవేసిన సంబంధంగా తరతరాలకూ నిలిచిపోండని అత్తయ్య ఒక తల్లిగా దీవించే చల్లని తరుణం..
ఆడదంటే ఆడదానికి శత్రువు కాదు అని
అత్త గుండెలోన కూడ అమ్మ వున్నదని
బొమ్మలాటలాడుతున్న బ్రహ్మ రాతలని
మార్చి రాసి చూపుతున్న మానవత్వమిది
చరితలు చదవని తొలి కథగా
మనసులు ముడి పడు మనుగడగా
తరతరాలకు నిలిచిపొమ్మని తల్లిగ దీవించే
చల్లని తరుణమిది
అనురాగమే మంత్రంగా..........
ఈ సన్నివేశానికి ఇంత కన్నా అందమైన పదాల కూర్పుని ఎవ్వరూ అందించలేరన్నంత అందంగా రాశారు మన సీతారామ శాస్త్రి గారు.. ఇంతకన్నా ఆయన గురించి చెప్పడానికి నాకు మాటలు లేవండీ. జీవితంలో ఒక్కసారి ఆయన్ని కలిసి పాదాభివందనం చేస్తే ఈ జీవితానికి చాలు అనిపిస్తుంది..
నాకు ఈ పాట Youtube లో దొరకలేదు, క్షమించగలరు లింక్ ఇవ్వలేకపోతున్నందుకు..

Thursday, October 21, 2010
పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా..
జీవితం మీద ఎన్నో ఆశలతో, ఇంకా ఏదో మంచి జరగాలనే కోరికలతో, బోలెడన్ని మనసులోనే కోరేసుకుంటూ గుళ్లు గోపురాలూ తిరుగుతూ ఉంటాం.. అసలు ఆ ప్రదేశాల దగ్గరకు వెళ్లగానే ఏదో తెలియని ప్రశాంతత.. అంతెందుకు, ఎక్కడైనా దేవుడి పాటలు విన్నా, గుడి గంటలు దూరంగా వినిపించినా ముఖ్యంగా హారతి కనిపించినా అప్పటి వరకూ మనసు అడుగుల్లో ఎక్కడో దాగి ఉన్న భక్తి బైటికి వస్తుంది. దేవుడి పాటలకి, గుడి గంటలకి, హారతికి ఉన్న గొప్పతనం అలాంటిది.
ఒక్కసారిగా జీవితం ఆగిపోతుంది.. మన ఆలోచనలు, మన అనుభవాలు, అనుభూతులు, ఇష్టాయిష్టాలు, అనుబంధాలు, అన్నీ.. అన్నీ ఆగిపోతాయి ఉన్నట్టుండి. కాదు.. చావు మనకి దూరం చేస్తుంది వీటన్నిటినీ. మరి చనిపోయాక..? వేటి సంగతి ఎలా ఉన్నా దేహాన్ని మాత్రం ఒక నిప్పు కణిక కాల్చేస్తుంది..

అక్కడ హారతి.. ఇక్కడ చితి.. రెండూ ఒకే నిప్పు కణిక.. కానీ అర్థం చేసుకోడానికి ఒక జీవితకాలం పట్టేంత లోతైన భేదం ఉంది వాటి మధ్య.
చూడగానే అర్థం అయిపోయింది అనిపిస్తుంది మన సిరివెన్నెల గారి సుస్వాగతం చిత్రంలోని "ఆలయాన హారతిలో" అన్న పాట. కానీ విన్న ప్రతి సారీ కొత్త అర్థాన్ని వివరిస్తూ ఉంటుంది పాటలోని ప్రతి మాట.. ప్రేమ అమృతమా హాలాహలమా అన్న అతి సున్నితమైన విషయాన్ని చిత్రంలో పాత్రకు తగ్గట్టుగా, ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా, సులువైన పదాలతో వర్ణించారు.
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో..
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం..
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్ని కణం..
దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం..
తన ప్రియురాలు ఖచ్చితంగా కనిపిస్తుంది అన్న గుండెలోని ఆశ తడి ఆవిరి అవుతున్నంత మాత్రాన, ఎండమావిలో తన చెలి ఉనికి కనిపిస్తుందా..! వాహ్.. ఎంత అద్భుతమైన వర్ణన.. ప్రేమ ఉంటే చాలు, ప్రపంచమంతా కనిపించడం మానేస్తుంది.. ప్రేమ ప్రపంచాన్ని మరిపిస్తుంది.. కానీ, కనిపించని ఆ ప్రేమ జాడని కనుక్కోవడం ఎంత కష్టం.! కనిపించని ఆ ప్రేమ ఆచూకీ కోసం ప్రపంచాన్ని, తనని మర్చిపోయి వెతుకుతూ తిరిగే ఒక మనసు వ్యధ ఇది. ఆ ప్రేమ జాడ తెలియని ప్రాణం, చుక్కలు దిక్కులు అన్నీ దాటుకుంటూ చేసే ప్రయాణమే ఈ పాట. "ఎదుట ఉంది నడి రేయన్నది ఈ సంధ్యా సమయం" .అద్భుతం.. ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చిందో శాస్త్రి గారికి..
ఎండమావి లో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా..
గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా...
ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా
ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా...
నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం
ఎదుట ఉంది నడి రేయన్నది ఈ సంధ్యా సమయం..
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం..
కొడుకు అనే కనుపాపను, తండ్రి అనే కనురెప్ప ఎంతో ప్రేమగా అపురూపంగా పెంచుకుంటూ ఉంటాడు. మరి అటువంటి కనుపాప కళ్లు తెరవకుండా కనే కల కోసం, తండ్రి సూర్యుడు కన్ను మూశాడట.. ఎంత బాగా పోల్చారు.. ఆ విషయం తెలియని కనుపాప ఇంకా కలవరిస్తూనే ఉందట తనకు కనిపించని ప్రియురాలి కోసం.. తనకు ఆయువిచ్చి, పెంచి పెద్ద చేసిన నాన్న అనే బంధం తన గురించే ఆలోచిస్తూ, ఏదీ చెప్పలేని మౌనంలో కాలిపోయినా కూడా, కనుల ముందుకు రాకుండా చీకటి తెరల వెనుకనే దాగి ఉన్న స్వప్నం కోసం తను ప్రారంభించిన వెతుకులాట ఆగలేదు కదా.. "పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా.." ఎంతో గొప్ప ఫిలాసఫీ ఇంత చిన్న పదాలతో నిర్మించబడిన ఒకే వాక్యంలో ఎలా పొదగబడిందంటారు..??
శాస్త్రి గారు.. మిమ్మల్ని పొగడడానికి నా దగ్గర మాటలు కరువయ్యాయండీ.. అద్భుతం.. హ్మ్.. చివరికి కనుపాప కలే కావాలి అడిగిందని నయనం శాశ్వతంగా నిదురలోకి వెళ్లిపోయిందట..
సూర్య బింబమే అస్తమించెనుగ మేలుకోని కల కోసం..
కళ్లు మూసుకుని కలవరించెనే కంటి పాప పాపం..
ఆయువిచ్చి పెంచిన బంధం మౌనం లో మసి అయినా..
రేయి చాటు స్వప్నం కోసం ఆలాపన ఆగెఆనా
పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా
కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం..
చిత్ర కథ మొత్తం ఒక్క పాటలో ఎంత అద్భుతంగా చెప్పారో కదా.. ఎక్కడో చదివాను... చేయి తిరిగిన రచయిత అంటే ఎన్నెన్నో గొప్ప గొప్ప పదాలు వాడేసి పెద్ద పెద్ద పుస్తకాలు రాసెయ్యడం మాత్రమే కాదట. అతి కొన్ని చిన్న చిన్న పదాలను ఉపయోగించి కూడా అర్థాన్ని ఎంతో అందంగా చెప్పగలగడం అట.. ఇక సిరివెన్నెల గారి గురించి ఈ విషయంలో చెప్పనవసరం లేదేమో కదూ..
Youtube Link : http://www.youtube.com/watch?v=sZAwHyQnEwQ

Friday, September 24, 2010
కరకు గర్జనల మేఘముల మేనికీ..
నాకు తెలిసి, తెలుగు మీద ఏ కొంచెం మమకారం ఉన్న వారి లిస్ట్ తీసినా ఈ పాటని ఇష్టపడని వారు ఉండరేమో.. తెలుగుదనం బ్రతికి ఉన్నంతవరకూ తెలుగు సాహిత్యాన్ని ఇష్టపడే వారికి ఈ పాట ఒక విందుభోజనమే.. అంతటి అందమైన అద్భుతమైన పాట ఇది.. ఏదా అని చూస్తున్నారా..? మన సీతారామ శాస్త్రిగారికి "సిరివెన్నెల" అని నామకరణం చేసిపెట్టిన చిత్రంలోని "ఆదిభిక్షువు వాడినేది కోరేదీ.." నే చెప్పింది నిజమే కదా..:)
భక్తి అంటే కేవలం అర్చనలు, అభిషేకాలు, స్తోత్రాలేనా.? ఇవన్నీ అందుకుంటున్నప్పుడు భక్తులు నాలుగు మాటలు అన్నా పడాలేమో.. కానీ అదేంటో.. శివయ్యే అన్నిటికీ ముండుంటాడు.. వరాలిచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. తన అభయహస్తం తోనే తన నెత్తి మీదే కష్టాలు కొన్ని తెచ్చుకుంటాడు.. నిజమే భోళా శంకరుడు..:) అందుకే భక్తితో.. ప్రేమతో నాలుగు మాటలు అన్నా వరాల వర్షం కురిపిస్తాడు.:))
అందుకే.. అప్పుడెప్పుడో శ్రీనాధుడు ఆ శివయ్యని నానా మాటలు అనేసి వరాలు పొందేశాడు..
సిరిగల వానికి చెల్లును తరుణులు
పదియారు వేల తగ పెండ్లాడన్
తిరుపమున కిద్దరాండ్రా పరమేశా
గంగ విడుము పార్వతి చాలున్
(ఈ పద్యంలో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్ద గలరు..)
పాపం.. శివయ్యకే అన్ని కష్టాలు కదూ.. ఇంతటితో ఊరుకుంటే ఏముంది..? ఇదిగో కింద ఉంది చూడండి.. మన సిరివెన్నెల ఎన్నెన్ని మాటలనేశారో ఆ శివయ్యని..
ఆది భిక్షువు వాడినేది కోరేదీ..
బూడిదిచ్చేవాడినేది అడిగేదీ..
ఏది కోరేది.. వాడినేది అడిగేదీ..(2)
తీపి రాగాల కోయిలమ్మకు
నల్ల రంగునలమిన వాడినేది కోరేది(2)
కరకు గర్జనల మేఘముల మేనికి
మెరుపు హంగు కూర్చిన
వాడినేది అడిగేదీ..
ఏది కోరేదీ వాడినేది అడిగేదీ..(2)
తేనెలొలికే పూల బాలలకు
మూణ్ణాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేదీ..(2)
బండ రాళ్లను చిరాయువుగ
జీవించమని
ఆనతిచ్చిన వాడినేది అడిగేదీ..
ఏది కోరేది వాడినేది అడిగేదీ..(2)
గిరిబాలతో తనకు కల్యాణమొనరింప
దరిజేరు మన్మధుని మసి జేసినాడు
వాడినేది కోరేదీ..
వర గర్వమున మూడు లోకాలు పీడింప
తలపోయు ధనుజులను కరుణించినాడూ..
వాడినేది అడిగేదీ...
ముఖ ప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు
వాడినేది కోరేదీ..
ముక్కంటి ముక్కోపి
ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడూ..
ఈ పాట గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది.. ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని ఎలా అందివ్వగలరో..!! ఈ పాట విన్నప్పుడల్లా, మనసు ఒక సంపూర్ణత్వాన్ని పొందిన భావన కలుగుతుంది. ఒక completeness, ఒక saturated feeling.. అలాంటి భావన. ఏమో మాటల్లో చెప్పలేక పోతున్నాను.. నా భావాన్ని చెప్పడానికి నాకు వచ్చిన భాష సరిపోవడం లేదు :( భాషకందని భావం అంటే ఇదేనేమో.. లేదా.. నాకు వచ్చిన అతి కొంచెం భాష సరిపోవడం లేదేమో.. ఈ పాటకి నా మాటలు ఏమి జత చేసినా, అది పాట అందాన్ని తగ్గించడమే అవుతుంది.. అందుకే ఈ అందమైన భావాన్ని మనసులోనే దాచి పెట్టేసుకుందామని నిర్ణయించుకున్నాను.. :))
You Tube Link : http://www.youtube.com/watch?v=hRgJgo0hRMA

Sunday, September 19, 2010
అమ్మమ్మ.కాం
"టివి సీరియల్" అన్న పేరు వినగానే మనలో ఎంత మందికి తరువాత చెప్పబోయే మాటలు వినాలనిపిస్తుంది..? నాకు మాత్రం అసలు ఆ పేరు విన్న వెంటనే మొదట అక్కడి నుండి లేచి వెళ్లిపోవాలనిపిస్తుంది. అంత "ఇష్టం" నాకు సీరియల్స్ అంటే. కానీ మట్టిలోనే మాణిక్యం ఉన్నట్లుగా అలాంటి ఏడుస్తూ ఏడిపించే చెత్త సీరియల్స్ మధ్యలో ఒక మంచి సందేశాత్మకమయిన సీరియల్ చూసి విస్తు పోయాను (మొదట్లో..) అదే మన "అమ్మమ్మ.కాం".
నేనైతే ఎక్కువగా చూడలేదు కానీ, తెలిసిన వారు చెబితే అనుకున్నాను సీరియల్స్ కూడా ఇంత మంచిగా ఉంటాయా అని. సీరియల్ గురించి విస్తుపోవడం ఒక వంతైతే, ఒక అమ్మాయినో, అబ్బాయినో పెట్టి వెనకాల 20 మందిని పెట్టి సీరియల్ పేరుని పది సార్లు రాగయుక్తంగా పాడించేసి(ఆడించేసి) పాట అయిపోయిందనిపించే సాహిత్యం ఉంటున్న ఈ రోజుల్లో ఇంత మంచి పాట విని ఆశ్చర్యం ఆనందం రెండు ఒకే సారి కలగడం రెండో వంతు. ఈ పాట మీద ఆసక్తితో మన గూగులమ్మని అడిగి చూశాను. అందులో ఈ పాట గురించిన ఒక వీడియో చూశాను. అందులో సిరివెన్నెల గారు ఏమన్నారంటే " ఏదైనా సినిమాలో పాట అయితే కొన్ని సార్లు వినేసి, మళ్లీ కొత్త పాటల మోజులో పడిపోతాం. కానీ సీరియల్ కోసం రాసిన పాట అయితే 365 రోజులు ప్రతి ఇంట్లో వినాల్సి వస్తుంది. మరి ఆ పాట విన్న ప్రతి సారీ కొత్త అర్థాన్ని వినిపించగలగాలి. అదే ఈ నా ప్రయత్నం.."
నాకైతే సిరివెన్నెల గారు నూరు శాతం తను కోరుకున్నది సాధించారు అనిపించింది. కావాలంటే మీరే చూడండి..
పల్లవి :
ఏ దారమూ పంపందే వెళ్లదే ఆ మబ్బుదాకా గాలిపటం..
ఏ మార్గమూ ఏనాడూ మరవదే ఈ మట్టి తో తన చుట్టరికం..
ఉన్నపాటుగా.. కలగలేదుగా.. చందమామనే చేరే ఙ్ఞానం.
చిన్ననాటనే.. మొదలయిందిగా.. దాయి దాయనే ఊహా గానం.
నిన్నంటే ఎన్నో ప్రశ్నల భారం మోస్తూ నడిచిన కాలం.
వెన్నంటే ఆ బరువేగా చూపించింది నేడీ తీరం.
నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవసారం.
ఆ మాటే మళ్లీ కొత్తగ చెబుతుందీ అమ్మమ్మ డాట్ కాం.
చరణం:
అపుడు అపుడూ గతమే వెతుకు సుడిలో పడితే సలహా అడుగూ..
గడిచిన రోజులు తలవడమెందుకు ఏం లాభం అనకూ..
ఏ దిక్కులు తోచని చిక్కుల దారిని దాటిన
నాటి స్మృతి చూపద నీ ప్రగతి..
లక్షంటే తనకై తానే వెనకకు జరిగిన ఒకటికి అర్థం..
ఆ ఒకటే లేకుంటే సున్నాలెన్నున్నా ఎందుకు వ్యర్ధం..

గుహలే గృహమై ఒదిగే బ్రతుకు మహలే నెలవై ఎదిగే వరకు
ఏ ఆలోచన వేసిందో కద ఎపుడో ముందడుగూ..
ఆ రాతియుగాలను నేటి సుఖాలుగ
మలచిన ఆశలకు మొదలేదో అడుగూ..
వేగంగా రివ్వూరివ్వున గాల్లో దూసుకు పోయే బాణం
తననొదిలిన విల్లేదంటే ఏమో అంటే చేరదు గమ్యం.
నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవసారం

మనం ఎంత ఎత్తుకి ఎదిగినా,అంతరిక్షం లోకి వెళ్లినా, ఒకప్పుడు నిలబడ్డ నేలని, ఆ అనుభవాలని మర్చిపోవద్దు అని ఎంత సున్నితంగా చెప్పారో.. నేను చూసిన వీడియోలోనే చెప్పారు సిరివెన్నెల. మన తరువాత తరాలు అంతరిక్షంలోకి వెళ్లిపోయి, అక్కడే వేరు వేరు గ్రహాల్లోనో, అక్కడ కూడా స్థలం సరిపోకపోతే శాటిలైట్స్ లోనే నివాసాలు ఏర్పరుచుకుని ఉండిపోవచ్చు. మరి అప్పుడు వారికి ఏ విషయంలో అయినా అనుమానాలు సందేహాలు వగైరా వస్తే వెంటనే అప్పుడెప్పుడో మన అమ్మమ్మలు తాతయ్యలు భూమి మీద ఉన్నప్పుడు ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏమి పాటించారో ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ కాలానికి తగ్గట్లుగా, తరానికి తగ్గట్లుగా దానిని అక్కడ కూడా అప్లై చెయ్యొచ్చట.:)
అందుకే పాటలో చెప్పారు,
"అపుడు అపుడూ గతమే వెతుకు సుడిలో పడితే సలహా అడుగూ..
గడిచిన రోజులు తలవడమెందుకు ఏం లాభం అనకూ."
ముఖ్యంగా నాకు ఈ పాటలో నచ్చిన వాక్యాలంటే
"నిన్నంటే ఎన్నో ప్రశ్నల భారం మోస్తూ నడిచిన కాలం.

ఆ మాటే మళ్లీ కొత్తగ చెబుతుందీ అమ్మమ్మ డాట్ కాం."
అయినా అసలు ఏ పదం గురించి చెప్పాలి..? ఏ వాక్యం గురించి చెప్పాలి. మీరే చెప్పండి.
"ఏ దారమూ పంపందే వెళ్లదే ఆ మబ్బుదాకా గాలిపటం..
ఏ మార్గమూ ఏనాడూ మరవదే ఈ మట్టి తో తన చుట్టరికం.."
ఎంత బాగంటుంది కదా.. నిజమే, ఈ ప్రపంచంలో ఏదీ కూడా తన బేస్ ని మర్చిపోదు. మనుషులే ప్రతి దాంట్లో ముందుంటారు. మర్చిపోయే విషయంలో కూడా..
మనుషులు అంతరిక్షంలో కి వెళ్లారు, చందమామని ముద్దాడి వచ్చారు అంటే అది కేవలం సాంకేతిక పరిఙ్ఞానం మరియు సాధించాలి అన్న తపన అని తెలుసు. ఇలా చిన్నప్పుడు అన్నం తినకపోతే అమ్మ చందమామని చూపించి "దాయి దాయి" అని పిలిచినప్పుడు కలిగిన ఇష్టం అని తెలియదు.
అదేంటో పాట విన్న ప్రతి సారి కొత్త అర్థాన్ని ఇవ్వడం అంటే ఏంటో అనుకున్నాను. కానీ ఇలా ఇప్పటికే ఒక నిర్వచనం కలిగి ఉన్న విషయాలకి మళ్లీ కొత్త నిర్వచనం ఇస్తారని మాత్రం తెలియదు.

గుహల్లోనే మన జీవితాలని గడిపి రాళ్లతోనే మిగిలిపోవాల్సిన మనం ఇలా సుఖ సౌఖ్యాలతో జీవించే స్థాయికి ఎదిగాం అంటే అసలు ఈ ఆశలకి ఆలోచనలకి మొదలు ఎక్కడ ఉండుంటుందంటారు..? కాస్త తెలిస్తే చెబుదురూ..:))
ఈ పాటలో మరో గొప్ప విషయం ఏమిటంటే.. Picturisation కూడా చాలా బాగుంటుంది. పాట అంతా.. ఒక అమ్మాయి పుట్టినప్పటి నుండీ పెళ్లయ్యి, అమ్మ అయ్యి, అమ్మమ్మ కూడా అయినంత వరకూ చూపిస్తారు. కానీ ఎక్కడా ఆ అమ్మాయి ముఖం కూడా చూపించరు.. చాలా కొత్తగా అనిపించింది:))
YouTube Links:
http://www.youtube.com/watch?v=sAuXk3RBJPM
http://www.youtube.com/watch?v=9U5owvrCVF8

Wednesday, August 18, 2010
నీదో కాదో రాసున్న చిరునామా..
ఆకాశం నాభి నుండి పరుగు పరుగున కిందికి దూకే వాన.. నేల తల్లి పొత్తిళ్ల లోకి పసి బిడ్డలా ఒదిగి పోయే వాన; ఒక్కో సారి అతి సుకుమారంగా, ఒక్కో సారి భయంకరంగా, మరో సారి బాధ్యతలా.
మీరూహించింది నిజమే.. ఇప్పుడు మనం "వాన" చిత్రం లోని పాటను గుర్తు చేసుకోబోతున్నాం.. ఈ మధ్యనే సిరివెన్నెల గారు ఒక interview లో చెప్పిన మాటలు (కొన్ని మార్పులతో): "ప్రేమ అనబడే ఈ అర్థం లేని భావాన్ని ఎందులో అని చూపించగలం..? ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి. తల్లి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య, తండ్రి కూతురి మధ్య, భార్యభర్తల మధ్య. ఇవన్నీ ప్రేమలే.. నిజానికి ప్రేమ అనేది రంగు రూపు లేని ఒక ఫీలింగ్. అందుకే ప్రేమను వర్ణించడానికి నేను తీసుకునే వస్తువులు సాధ్యమైనంత వరకు ప్రకృతిలోంచి పుట్టినవై ఉంటాయి. చినుకు, ఆకాశం, నేల, గాలి, చెట్టు, ఆకు, పువ్వు, కాయ వీటన్నిటిల్లో కూడా ప్రేమ ఉంటుంది. ఇవన్నీ ప్రేమకు స్వరూపాలే."
మరి వాన లో వర్ణించిన ప్రేమ ఎలా ఉందో చూద్దామా.!
ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమో...
ఎదను తడిమింది నేడు.. చినుకంటి చిన్నదేమో...
మైమరచి పోయా మాయలో...
ప్రాణమంత మీటుతుంతే.. వాన వీణలా... "ఎదుట నిలిచింది"
నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి...
కలే అయితె ఆ నిజం ఎలా తట్టుకోవాలీ....
ఔనో కాదో అడగకంది నా మౌనం...
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం...
చెలిమి బంధమల్లుకుందే.. జన్మ ఖైదులా..ఆ.. "ఎదుట నిలిచింది"
నిన్నే చేరుకోలేకా ఎటెళ్లిందొ నా లేఖా...
వినేవారు లేకా విసుక్కుంది నా కేకా..
నీదో కాదో రాసున్న చిరునామా...
ఉందో లేదో ఆ చోట నా ప్రేమ...
వరం లాంటి శాపమేదో.. సొంతమైందిలా..ఆ... "ఎదుట నిలిచింది"
ఎక్కడో విన్నాను, ప్రేమంటే ఒక తీపి బాధ అట. ఈ పాట వింటే అది నిజమేనేమో అనిపిస్తుంది.. అంతటి తియ్యని ప్రేమలోని బాధని, కలో నిజమో తెలియని అయోమయాన్ని చాలా అందంగా.. అందమైన పదాలతో వర్ణించారు. వింటున్నంత సేపూ, విన్న తరువాత కూడా చాలా సమయం మనసంతా ఏదో తెలియని హాయితో నిండి పోయి ఉంటుంది. కారణం.. పదాల అల్లిక కొంత అయితే, ఆ అల్లికకు అందించిన సంగీతం, గానం ఇంకా అద్భుతం.
ఈ పాటలో చాలా గొప్ప గొప్ప పదాలు, గంభీరమైన పదాలు అంటూ ఏవీ లేవు. చాలా మామూలు పదాలతో ఇంతటి అందాన్ని సృష్టించారు సిరివెన్నెల. ముఖ్యంగా తన ప్రేమ ప్రియురాలి వరకూ చేరిందా లేదా అన్న అనుమానం/ అయోమయం ఎంత చక్కా చెప్పారంటే..
"నిన్నే చేరుకోలేకా ఎటెళ్లిందొ నా లేఖా...
వినేవారు లేకా విసుక్కుంది నా కేకా..
నీదో కాదో రాసున్న చిరునామా...
ఉందో లేదో ఆ చోట నా ప్రేమ..."
నిజంగా అద్భుతం..:) మనసుకు ప్రశాంతంగా ఉంటుంది వింటున్నంత సేపూ..
కలో నిజమో తెలియని సందిగ్ధ స్థితి..
"నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి...
కలే అయితె ఆ నిజం ఎలా తట్టుకోవాలీ...."
"చెలిమి బంధమల్లుకుందే.. జన్మ ఖైదులా" చెలిమి బంధం జన్మ ఖైదట.. అసలు అలా వర్ణించాలన్న ఆలోచన ఎలా వచిందబ్బా..
అన్ని రకాల పాటలు ఎంత అలవోకగా రాసేస్తారో సిరివెన్నెల గారు. ఆ పాత్ర లోకి దూరిపోయి రాస్తే తప్ప ఇంత అందమైన పాటలు రావు మరి..

Subscribe to:
Posts (Atom)