Wednesday, August 18, 2010

నీదో కాదో రాసున్న చిరునామా..

ఆకాశం నాభి నుండి పరుగు పరుగున కిందికి దూకే వాన.. నేల తల్లి పొత్తిళ్ల లోకి పసి బిడ్డలా ఒదిగి పోయే  వాన; ఒక్కో సారి అతి సుకుమారంగా, ఒక్కో సారి భయంకరంగా, మరో సారి బాధ్యతలా.
మీరూహించింది నిజమే.. ఇప్పుడు మనం "వాన" చిత్రం లోని పాటను గుర్తు చేసుకోబోతున్నాం.. ఈ మధ్యనే సిరివెన్నెల గారు ఒక interview లో చెప్పిన మాటలు (కొన్ని మార్పులతో): "ప్రేమ అనబడే ఈ అర్థం లేని భావాన్ని ఎందులో అని చూపించగలం..? ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి. తల్లి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య, తండ్రి కూతురి మధ్య, భార్యభర్తల మధ్య. ఇవన్నీ ప్రేమలే.. నిజానికి ప్రేమ అనేది రంగు రూపు లేని ఒక ఫీలింగ్. అందుకే ప్రేమను వర్ణించడానికి నేను తీసుకునే వస్తువులు సాధ్యమైనంత వరకు ప్రకృతిలోంచి పుట్టినవై ఉంటాయి. చినుకు, ఆకాశం, నేల, గాలి, చెట్టు, ఆకు, పువ్వు, కాయ వీటన్నిటిల్లో కూడా ప్రేమ ఉంటుంది. ఇవన్నీ ప్రేమకు స్వరూపాలే." 
మరి వాన లో వర్ణించిన ప్రేమ ఎలా ఉందో చూద్దామా.!


ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమో...
ఎదను తడిమింది నేడు.. చినుకంటి చిన్నదేమో...
మైమరచి పోయా మాయలో... 
ప్రాణమంత మీటుతుంతే.. వాన వీణలా...                     "ఎదుట నిలిచింది"

నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి...
కలే అయితె ఆ నిజం ఎలా తట్టుకోవాలీ....
ఔనో కాదో అడగకంది నా మౌనం...
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం...
చెలిమి బంధమల్లుకుందే.. జన్మ ఖైదులా..ఆ..               "ఎదుట నిలిచింది"

నిన్నే చేరుకోలేకా ఎటెళ్లిందొ నా లేఖా...
వినేవారు లేకా విసుక్కుంది నా కేకా..
నీదో కాదో రాసున్న చిరునామా...
ఉందో లేదో ఆ చోట నా ప్రేమ...
వరం లాంటి శాపమేదో.. సొంతమైందిలా..ఆ...               "ఎదుట నిలిచింది" 


ఎక్కడో విన్నాను, ప్రేమంటే ఒక తీపి బాధ అట. ఈ పాట వింటే అది నిజమేనేమో అనిపిస్తుంది.. అంతటి తియ్యని ప్రేమలోని బాధని, కలో నిజమో తెలియని అయోమయాన్ని చాలా అందంగా.. అందమైన పదాలతో వర్ణించారు. వింటున్నంత సేపూ, విన్న తరువాత కూడా చాలా సమయం మనసంతా ఏదో తెలియని హాయితో నిండి పోయి ఉంటుంది. కారణం.. పదాల అల్లిక కొంత అయితే, ఆ అల్లికకు అందించిన సంగీతం, గానం ఇంకా అద్భుతం.
ఈ పాటలో చాలా గొప్ప గొప్ప పదాలు, గంభీరమైన పదాలు అంటూ ఏవీ లేవు. చాలా మామూలు పదాలతో ఇంతటి అందాన్ని సృష్టించారు సిరివెన్నెల. ముఖ్యంగా తన ప్రేమ ప్రియురాలి వరకూ చేరిందా లేదా అన్న అనుమానం/ అయోమయం ఎంత చక్కా చెప్పారంటే..
"నిన్నే చేరుకోలేకా ఎటెళ్లిందొ నా లేఖా...
వినేవారు లేకా విసుక్కుంది నా కేకా..
నీదో కాదో రాసున్న చిరునామా...
ఉందో లేదో ఆ చోట నా ప్రేమ..."
నిజంగా అద్భుతం..:) మనసుకు ప్రశాంతంగా ఉంటుంది వింటున్నంత సేపూ..

కలో నిజమో తెలియని సందిగ్ధ స్థితి..
"నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి...
కలే అయితె ఆ నిజం ఎలా తట్టుకోవాలీ...." 

"చెలిమి బంధమల్లుకుందే.. జన్మ ఖైదులా" చెలిమి బంధం జన్మ ఖైదట.. అసలు అలా వర్ణించాలన్న ఆలోచన ఎలా వచిందబ్బా.. 
అన్ని రకాల పాటలు ఎంత అలవోకగా రాసేస్తారో సిరివెన్నెల గారు. ఆ పాత్ర లోకి దూరిపోయి రాస్తే తప్ప ఇంత అందమైన పాటలు రావు మరి..
 


19 comments:

Sai Praveen said...

ఈ పాట నేను ఎప్పుడు సరిగ్గా వినలేదు. ఇప్పుడు వినాలి.
జలతారు అంటే అర్ధం ఏమిటి?

మనసు పలికే said...

సాయి ప్రవీణ్ గారు, నాకు కూడా సరిగ్గా తెలియదండీ జలతారు అర్థం.. ఇక్కడ ఉన్న తెలుగు పండితులెవరైనా చెప్పాలి.:(

hanu said...

nice one... anDI.. manchi paaTani maLLi gurtucheSaru...

మనసు పలికే said...

ధన్యవాదాలు హను గారూ..:)

హరే కృష్ణ said...

బావుంది అపర్ణ

ఏ సినిమాలో ఉంటుంది ఈ పాట
youtube లింక్ ఇవ్వగలరా

మనసు పలికే said...

ధన్యవాదాలు కృష్ణ గారు.. :) ఈ పాట వాన చిత్రం లోది..
Youtube Link
http://www.youtube.com/watch?v=TV_6oQUviAk&feature=related

nagarjuna said...

ఈ పాట ఏ సినిమాలోది అని అడుగుతావా కృష్ణ !!
ఎంటయ్యా ఇది..పేరడీలు చేసెవాల్లు చేసే పనేనా ఇది.

మనసు పలికే said...

నాగార్జున బాగా అడిగావ్..:) నువ్వు ఏమాత్రం తగ్గొద్దు..:):)

హరే కృష్ణ said...

గు ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్...నిద్రొస్తోంది

హరే కృష్ణ said...

జలతారు అంటే నీటి మిశ్రమము తో తయారుచేయబడిన తారు అని అర్ధం

మనసు పలికే said...

హిహ్హిహ్హీ.. కృష్ణ, సూ..పర్ అర్థాన్నిచ్చావ్..:)

3g said...

>>ఈ పాటలో చాలా గొప్ప గొప్ప పదాలు, గంభీరమైన పదాలు అంటూ ఏవీ లేవు. చాలా మామూలు పదాలతో ఇంతటి అందాన్ని సృష్టించారు సిరివెన్నెల.

ఆయన గొప్పతనమే అదండి చాలా మామూలు పదాలతో కూడా అద్బుతమైన అర్ధాలనిస్తారు. ’నువ్వే నువ్వే’ లో కొన్ని లైన్లు ఉంటాయి

పెంచిన వాళ్ళ ప్రేమ గొప్పదా.... వయసొచ్చాక ప్రేమించినవాళ్ళ ప్రేమ గొప్పదా అనే సంక్లిష్టమైన సమస్యని తీర్చటానికి ఆయన తీసుకున్న ఉదాహరణలు చూడండి.

" నేల వైపు చూసే నేరం చేసిందని నీలిమబ్బు నిందిస్తుందా వాన చినుకుని,
గాలి వైపు వెళ్ళేమారం మానుకొమ్మని తల్లితీగ బందిస్తుందా మల్లెపూవుని" అని
గ్రేట్ కదా!!!!!!!!

మనసు పలికే said...

3g గారూ!! నిజంగా చాలా గొప్ప ఉదాహరణలు గుర్తు చేశారు.:) అందుకే ఆయన్ని ఎంత పొగిడినా నాకు అది తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది. నాకు నా మనసులోని భావాలు ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు ఆయన విషయంలో.. అంత ఇష్టం ఆయన పాటలంటే..

సావిరహే said...

jalatharu = jalapatham

vennla jalapatham ani meaning akkada

:-)

మనసు పలికే said...

సావిరహే గారు.. ధన్యవాదాలు.. జలతారు అర్థం తెలియజేసినందుకు.. :))

హరే కృష్ణ said...

సావిరహే గారు జలతారు అర్ధం చెప్పి నన్ను అవమానించారు :D
అపాలజీ చెప్పించాలి

జ్యోతి said...

జలతారు అంటే వెండి బంగారపునీరు పోసిన నూలుదారం,Gold or silver lace

గీతిక said...

జలతారు అంటే_ వెండి, బంగారు నీరు (మెరుపు వచ్చేందుకు) పూసిన దారం... (నీరు పోసిన కాదు).

మనసుపలికే గారూ... మీ బ్లాగు ఇప్పుడే పూర్తిగా (అంటే కొంచెం కొంచెం ఇంతకు ముందు తెలుసు) చూస్తున్నాను. చాలా బాగా వ్రాస్తున్నారు.
All the best and keep it up.

ps:
మీకభ్యంతరం లేకపోతే మీ పేరు తెలుసుకోవచ్చా...
గీతిక (b.geetika@ymail.com)

మనసు పలికే said...

గీతిక గారు, ధన్యవాదాలండీ, నా టపాలు నచ్చినందుకు :)ఇక జలతారు అర్థాన్ని చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్..పేరు చెప్పడంలో అభ్యంతరం ఏమీ లేదండీ.. నా పేరు అపర్ణ..:)