Thursday, November 25, 2010

పుటుక్కు జర జర డుబుక్కు మే

"పుటుక్కు జర జర డుబుక్కు మే.. " ఎక్కడో విన్నట్లు ఉంది కదూ.. ఈ వాక్యం గురించి ఏదో చిత్రంలో ప్రకాష్‌రాజ్ మాట్లాడతాడు. ఈ వాక్యానికి చాలా పెద్ద అర్థం చెబుతాడు. కానీ నాకు ఈ వాక్యం వినగానే మాత్రం గుర్తొచ్చేది "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" చిత్రం లోని "పారిపోకే పిట్టా" పాట.మన అందరికీ తెలిసిన విషయమే.. సీతారామ శాస్త్రి గారు అతి సులువైన, అందరికీ అర్థమయ్యే పదాలతో ఎంత గొప్ప భావాన్నైనా పలికించగలరని. ఈ పాటని కూడా అలాగే చాలా సులువైన పదాలతో అర్థవంతంగా రాశారు.
తన ప్రియురాలికి దూరమై ఎలాగైనా చెలి చెంతకి చేరుకోవాలని సంకల్పంతో చేసే ప్రయాణంలో ఉన్న ఒక ప్రియుడి ఆరాటం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ పాటలో మనకి. నాకు ఈ పాట వింటూంటే నిజంగా దోసెడు విరజాజుల్ని తెచ్చి ముద్దగా మాలకట్టినట్లుగా అనిపిస్తుంది. అంత అందమైన పదాల అల్లిక ఈ పాట. ఇందులో ఎక్కువగా ఆకర్షించిన పాత్ర ప్రభుదేవాది. ప్రియుడి కబురుని ప్రియురాలి చెంతకు చేర్చమని రకరకాల పక్షులకి విన్నవిస్తాడు.

పాట మొదలుపెట్టడమే పారిపోయే పిట్టతో మొదలు పెడతారు. పారిపోయే ప్రేమ పిట్టను పారిపోవద్దని చాలా గారంగా బ్రతిమాలుతూ చెంతకు చేరకపోతే ఎలా అని గద్దిస్తూ.. మజిలీ చేర్చవా, నీ వెంటే వస్తాగా అంటూ.. చాలా నచ్చింది నాకు ఈ పల్లవి.

       పారిపోకే పిట్టా.. చేరనంటే ఎట్టా
       అంత మారాం ఏంటంట మాట వినకుండా
       సరదాగా అడిగాగా మజిలీ చేర్చవా
       తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట..

అనుకోని పరిస్థితుల్లో ప్రేమికులు ఇద్దరూ దూరమైనప్పుడు ఎవ్వరూ సంతోషంగా ఉండరు. విచిత్రం ఏమిటంటే, ఎవరికి వారు అవతలి వారు సంతోషంగా ఉంటే చాలు అని ఆశ పడుతూ ఉంటారు. ఇంత సున్నితమైన ప్రేమికుల మనస్తత్వాన్ని చాలా అందంగా వర్ణించారు సిరివెన్నెల. ప్రియుడు తన సంతోషాన్నంతా తన చెలితో పంపించాడట. ఇక్కడింకో చమత్కారం.. ప్రియుడి పేరు సంతోష్. తన సంతోషాన్నంతా ప్రియురాలి వెంట పంపించాడట ఆ సంతోష్. మరి తన చెలి ఆ సంతోషాన్ని భద్రంగా చూసుకుంటుందో లేదో అని బెంగ. చెలి సంతోషంగా ఉందో లేదో అన్న సందేహాన్ని ఇంత కన్నా అందంగా ఎవరూ వ్యక్త పరచలేరేమో అన్నంత అందంగా రాసారనిపించింది. 
ప్రతి క్షణం ఎంతో సరదాగా నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే అతను, తన అల్లరిని, చిందర వందర సరదాని చెలి అందెలుగా తొడిగాడట. (తన అల్లరి తనకు దూరమై అతను ముభావంగా ఉన్నాడన్నది కనిపించే సత్యం.) మరి ఆ అందెల్ని ప్రతి రోజూ సందడిగా ఆడిస్తుందా లేదా అన్న సందేహం.కానీ ఇలా విడిపోయినప్పుడు ఆ ప్రేయసి మాత్రం సంతోషంగా అల్లరిగా ఎలా ఉండగలుగుతుందండీ..?? అదొక ఆశ అంతే..

       నా సంతోషాన్నంతా పంపించా తన వెంట
       భద్రంగానే ఉందా ఏ బెంగా పడకుండా
       తన అందెలుగా తొడిగా నా చిందరవందర సరదా
       ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా

ఇక్కడే సందేహాలకి సమాధానాలు కూడానూ.. చెలికొమ్మ చినబోయిందనుకుంటా.. ప్రియుడి కోసమే ఎదురు చూసే తన ప్రియురాలి గుండె గూటికి అతను వచ్చేస్తున్నాడని ముందు గానే కబురు చెప్పమంటూ చిలుకమ్మని వేడుకోవడం.. అతడు వచ్చేలోగా విన్న కథలన్నీ ఆ అమ్మాయికి చెప్పమని కాకమ్మని కోరడం..
       
       చినబోయిందేమో చెలి కొమ్మ..
       ఆ గుండెల గూటికి ముందే కబురీయవే చిలకమ్మా
       నీ వాడు వస్తాడే ప్రేమా అని త్వరగా వెళ్లి
       నువ్విన్న కథలన్నీ చెప్పమ్మా కాకమ్మా…
       తీసుకుపో నీ వెంట..వస్తా తీసుకుపో నీ వెంట

ప్రేమలో ఉన్నా విరహంలో ఉన్నా ఆకలి నిద్దుర ఉండవట. ఇటువంటి ప్రయోగం చాలా పాటల్లో, కథల్లో, కవితల్లో చూసా కానీ ఇంత అందంగా అయితే ఎప్పుడూ చూడలేదు. ప్రియుడి దారిలో ఆకలి కనిపించిందట. అన్నం పెట్టను పోవే అని కసిరిందంటూ ప్రేయసి నిందించిందట. తన వద్దకు రావొద్దని తరిమేసినందుకు నిద్దుర చాలా చిరాగ్గా కనిపించిందట ప్రియుడికి.. నాకు ఈ ప్రయోగాలు ఎంత బాగా నచ్చాయో..

       ఆకలి కనిపించింది…నిన్నెంతో నిందించింది
       అన్నం పెట్టను పోవే అని కసిరేశావంది
       నిద్దర ఎదురయ్యింది..తెగ చిరాగ్గ ఉన్నట్టుంది
       తన వద్దకు రావద్దంటూ తరిమేశావంటుంది

ప్రేమా.. నిన్ను ఎదిరించే వాళ్లు, నువ్వడిగింది ఇవ్వని వాళ్లంటూ ఎవరూ లేరన్న సత్యం నీకు కూడా తెలుసు కదా.. మరి ఎందుకమ్మా ఇంత గారం చేస్తావు. నీ పంతం ముందు ఏ రోజైనా ఏ ఘనుడైనా గెలిచినట్లు చరిత్రలో లేదు కదా..

       ఏం గారం చేస్తావే ప్రేమ
       నువ్వడిగిందివ్వని వాళ్లంటూ ఎవరున్నారమ్మా
       ఆ సంగతి నీకూ తెలుసమ్మా
       నీ పంతం ముందు ఏనాడు ఏ ఘనుడు నిలిచాడో చెప్పమ్మా
       తీసుకుపో నీ వెంట..
       ఓ ప్రేమా తీసుకుపో నీ వెంట
       తీసుకుపో నీ వెంట..తీసుకుపో నీ వెంట

Youtube Link : http://www.youtube.com/watch?v=MiQoDE6Jqjc

24 comments:

వేణూరాం said...

నా సంతోషాన్నంతా పంపించా తన వెంట
భద్రంగానే ఉందా ఏ బెంగా పడకుండా
తన అందెలుగా తొడిగా నా చిందరవందర సరదా
ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా....

ఈ లైన్స్ ని ఇప్పటివరకూ అంతగా అబ్సెర్వ్ చెయ్యలేదు.. హీరో పేరు "సంతోష్" ని అందులో వాడారని కూడా ఇప్పటి వరకూ వెలగ లేదు నాకు...
పోస్ట్ ఎప్పటి లాగానే అదిరింది..

వేణూరాం said...

"పుటుక్కు జర జర డుబుక్కు మే.. "

ఇది విన్నాక పరుగు ప్రకాష్ రాజ్ గుర్తొచ్చాడా మీకు? నాకు తెనాలి రామ క్రిష్ణ gaaru గుర్తొస్తారు.. చిన్నప్పుడు ఏదొ కధలో చదివినట్టు గుర్తు.. :) :)

3g said...

//నిజంగా దోసెడు విరజాజుల్ని తెచ్చి ముద్దగా మాలకట్టినట్లుగా అనిపిస్తుంది// nice expression.

as usual ur review is good.

మనసు పలికే said...

వేణూరాం, ధన్యవాదాలు..:)
>>నాకు తెనాలి రామ క్రిష్ణ గారు గుర్తొస్తారు.. చిన్నప్పుడు ఏదొ కధలో చదివినట్టు గుర్తు.. :) :)
నిజమే కదూ.. నాకసలు గుర్తే లేదు సుమా..!! నీ మెమరీకి హ్యాట్సాఫ్..:)

3g గారు,
ధన్యవాదాలు టపా నచ్చినందుకు..:)

lalithag said...

పుటుక్కు జర జర.. కథ ఇక్కడ:
http://www.youtube.com/watch?v=lGEl8r9y1xM

భాను said...

ఆ పాట విన్నాను కాని ఇంత బాగా వినలేదు. మీ విశ్లేషణ చూశాక మళ్ళీ వినాలనిపిస్తుంది. అవును చివర్లో ఆ పాట ఆడియో పెడ్తే మీ సొమ్మేం పోయింది. ఇప్పుడు మేం మళ్ళీ వెతుక్కోవాలిగా. సినిమా లో చూసినప్పుడు ఇంత భావం బావుకత కనపడలేదండి. బహుశా ఆ పిక్చరైజేషన్ పాటా అర్థాన్ని డామినేట్ చేసినాట్టుంది. కొన్ని ఆ తర్వాత తీరిగ్గా వింటే ఆ ఆనందం వర్ణించ లేమండి. అది అనుభవించాల్సిందే నిజంగానే మీరన్నట్లు దోసెడు విరజాజుల్ని తెచ్చి ముద్దగా మాలకట్టినట్లుగా అనిపిస్తుంది.

భాను said...

ఇంతకీ నాకర్థం కాని విషయం ఈ పుటుక్కు జర జర డుబుక్కు మే కి ఈ పాటకి సంబంధం ఏమ్టండీ? కాస్త చెప్తారా అపర్ణ గారూ

మనసు పలికే said...

lalithag గారు, ధన్యవాదాలు లింక్ ఇచ్చినందుకు..:)

భాను గారు,
ధన్యవాదాలు నా వ్యాఖ్యానం నచ్చినందుకు..:)You tube link ఇద్దామనే అనుకున్నానండీ, కానీ మర్చిపోయాను. ఇదిగో లింక్ ఇక్కడ.
http://www.youtube.com/watch?v=MiQoDE6Jqjc

ఇక పుటుక్కు జర జర డుబుక్కుమే గురించి అంటారా.. ఈ పాటలో పల్లవి అయిన తరువాత వస్తుంది, ప్రభుదేవా పాత్ర పాడినట్లుగా

మధురవాణి said...

మంచి పాట గుర్తు చేశావ్ అపర్ణా! నాక్కూడా ఇష్టం ఈ పాట.. ప్రత్యేకంగా ఈ లైన్లు చాలా బాగుంటాయనిపిస్తుంది..
"నా సంతోషాన్నంతా పంపించా తన వెంట.. భద్రంగానే ఉందా ఏ బెంగా పడకుండా!
తన అందెలుగా తొడిగా నా చిందరవందర సరదా.. ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా!

ఆకలి కనిపించింది…నిన్నెంతో నిందించింది.. అన్నం పెట్టను పోవే అని కసిరేశావంది!
నిద్దర ఎదురయ్యింది..తెగ చిరాగ్గ ఉన్నట్టుంది.. తన వద్దకు రావద్దంటూ తరిమేశావంటుంది!"

Hatsoff to sirivennela! :)

Sai Praveen said...

చాలా బాగా రాసావు అపర్ణా. as usual. :)

మనసు పలికే said...

మధుర గారు.. ధన్యవాదాలు..:) నిజమేనండీ హ్యాట్సాఫ్ టు సిరివెన్నెల..

ప్రవీణ్.. ధన్యవాదాలు..:)

వేణూ శ్రీకాంత్ said...

అపర్ణ గారు ఎప్పటిలానే బాగారాశారు, నేనుకూడా ఇష్టంగా వినేపాట ఇది.

మనసు పలికే said...

వేణు శ్రీకాంత్ గారు.. ధన్యవాదాలు..:)

వేణూరాం said...

ఇక్కడ ఒక ఇమ్పోర్టేంట్ మేటర్ చెప్పడం మర్చి పోయాను.. ఫస్ట్ కామెంట్ నాదే.. హిహిహి...

గీతిక said...

పాటల్ని ఫ్లోలో పాడేస్తాం గానీ అర్థాన్ని పట్టించుకోం. ఆ అర్థాల్ని వివరంగా చెప్పడం చాలా బాగుంది. So nice Aparna.

బ్లాగ్ టైటిల్ దగ్గరుంది సన్నజాజి ఫొటో కదా. అందులోనూ వానలో తడిచిన సన్నజాజి మొగ్గలు... చాలా బాగున్నాయి. ఆ ఫొటో మీరు తీసిందేనా...?

నాదో చిన్న సలహా... అభ్యర్థన అనుకో.. ప్లీజ్...! టైటిల్ క్రింద క్యాప్షన్‌లో విరజాజిని సన్నజాజిగా మార్చవా ప్లీజ్...


గీతిక

హరే కృష్ణ said...

నువ్వు జీవితాన్ని చదివేసావ్ అప్పూ..ఎటువంటి పాటనైనా అదే ఫీల్ తో చెబుతావు కాస్త వెరైటీ గా ట్రై చేస్తే చూడాలని ఉంది
నిన్ను అప్పూ అని పిలిచినందుకు పాపాయి అశోక్ వచ్చి మళ్లీ ఇది నా పేటెంట్ అని గోడవేసుకోడు కదా..

గీతిక గారు విరజాజి అయినా సన్న జాజి అయినా జాజులు ని వదలలేదు కాబట్టి మీరు కూడా మంచోరు
జాజి పూలు అభిమానులన్నాక జాజులంటే ఆ మాత్రం ప్రేమ ఉండాలి

మనసు పలికే said...

వేణూరాం.. :))

గీతిక గారు, ధన్యవాదాలండీ..:) ఫోటో నచ్చినందుకు మళ్లీ ధన్యవాదాలు. అది నేను తీసిన ఫోటో కాదండీ. నెట్‌లో వెతికిందే. నాకు విరజాజులంటే చాలా చాలా ఇష్టం. విరజాజుల ఫోటో కోసం వెతికితే మంచి ఫోటో దొరకలేదు. సరేలే ఏ జాజులైతే ఏమిటిలే అని ఈ ఫోటో పెట్టాను..:) విరజాజిని సన్నజాజిగా మార్చమంటారా..:( విరజాజుల ఫోటో దొరికితే నాకిద్దురూ ప్లీజ్ ప్లీజ్..

మనసు పలికే said...

కృష్ణ.. ధన్యవాదాలు..:) వెరైటీగా ఎంటే ఎలా..? కాస్త వివరంగా చెప్పొచ్చుగా..
>>నిన్ను అప్పూ అని పిలిచినందుకు పాపాయి అశోక్ వచ్చి మళ్లీ ఇది నా పేటెంట్ అని గోడవేసుకోడు కదా..
హిహ్హి..
కృష్ణ.. జాజుల గురించి భలే చెప్పావుగా.. నిజానికి నేను ఈ బ్లాగు మొదలు పెట్టేసరికి నాకు నేస్తం అక్క బ్లాగు తెలియదు. ఇప్పుడు భలే సంతోషం వేస్తుంది.. అనుకోకుండా అక్క బ్లాగు పేరుతో నా బ్లాగు పేరు కొంచెమైనా కలిసినందుకు..;) ఇప్పుడు నువ్వు, వేణూరాం ఇంకా సాయి ప్రవీణ్ కూడా కుళ్లుకోవాలి.. హహ్హహ్హా

శిశిర said...

ఈ పాట చాలా సార్లు విన్నా (చూశా) కానీ, ఈ పాటలో ఇంత అందం ఉందని మీ వ్యాఖ్యానం చదివాకే తెలిసింది.

ఆకలి కనిపించింది…నిన్నెంతో నిందించింది
అన్నం పెట్టను పోవే అని కసిరేశావంది
నిద్దర ఎదురయ్యింది..తెగ చిరాగ్గ ఉన్నట్టుంది
తన వద్దకు రావద్దంటూ తరిమేశావంటుంది

really hats off to sirivennela.

మనసు పలికే said...

శిశిర గారూ.. ధన్యవాదాలు పాట ఇంకా వ్యాఖ్యానం నచ్చినందుకు..:) నిజంగా సిరివెన్నెల గారికి హ్యాట్సాఫ్.

అశోక్ పాపాయి said...

అసలు ఈ సిరివెన్నెల బ్లాగ్ లో టపాలు పుటుక్కు జర జర డుబుక్కు మే అన్నట్టు ఎప్పుడు వస్తున్నాయో అర్దం కావటం లేదు...:-)

హరే కృష్ణ గారు అయ్యొ అదేం లేదండి ఎంతయిన మీరు భలే నవ్విస్తారు...:-)

నేస్తం said...

నిజం చెప్పాలంటే నేను పాటల సాహిత్యం పెద్దగా వినను ఏదో మరీ సంగీతం బాగుంటే తప్పా..కాని సిరివెన్నెల గారి పాటలు మాత్రం సంగీతాన్ని ప్రక్కన తోసేసి మనసులోకి చొచ్చుకుపోతాయి..ఆయన పాటల గురించి చక్కగా రాస్తున్నావ్ అపర్ణ

మనసు పలికే said...

నేస్తం అక్కయ్యా.. అదే కదా మరి సిరివెన్నెల గొప్పతనం..:) ధన్యవాదాలు టపా నచ్చినందుకు..:)

మనసు పలికే said...

అశోక్.. అవునా..:( ఈ సారి నుండి టపా వేస్తున్నా అని ఒక టపా పెట్టి మరీ తరువాత రోజు వెయ్యనా టపా....;)