అమ్మాయి వాసనంటేనే పడని ఆ ప్రవరాఖ్యుడి ప్రవర్తనని చూసి విస్తుపోతూ, ఇష్టపడుతూ అతని మనస్సుని చదవడానికి ప్రయత్నిస్తున్న ఒక అమ్మాయి అంతరంగం. వెంటపడే అమ్మాయిని ప్రాణహాని గానో మానహాని గానో అనుకుంటూ పొగరుగానో బెదురుగానో వడి వడిగా పారిపోయే అబ్బాయి వాలకం. వెరసి సాహితీ ప్రియులకు ఒక మంచి కాఫీ లాంటి గీతం.
పల్లవి
అతడిలో ఏదో మతలబు ఉందే ఏంటంటే చెప్పడుగా..
అతివను చూస్తే ఆమడ దూరం పోతాడే వడి వడిగా..
ప్రాణ హాని, మాన హాని వెంటపడి వస్తున్నట్టు..
పొగరనాలో బెదురనాలో వాలకం చూస్తుంటే..
అతడిలో ఏదో మతలబు ఉందే ఏంటంటే చెప్పడుగా..
అతివను చూస్తే ఆమడ దూరం పోతాడే వడి వడిగా..
ప్రాణ హాని, మాన హాని వెంటపడి వస్తున్నట్టు..
పొగరనాలో బెదురనాలో వాలకం చూస్తుంటే..
విరక్తి చెందే వయస్సూ కాదు, తపస్సు చేసే మనస్సూ లేదు. అంటే, ఎలాంటి తేడానూ లేదు. మరెందుకో ప్రేమాన్నా, అమ్మాయన్నా ఈ దూరం. ప్రేమకి, పెళ్లికి, చివరికి అమ్మాయితో స్నేహానికి కూడా దూరంగా ఉండి ఏకాకిలా ఎన్నాళ్లుంటాడో పాపం..
చరణం1
విరక్తి చెందే వయస్సు కాదే పైలా పచ్చీసే..
తపస్సు చేసే తలంపు లేదే హుషారైన ఫేసే..
ఏతావాతా తేలేదేమిటి ఎలాంటి తేడా లేదే..
ప్రేమా భామా అనేవి మాత్రం చెవిలో పడరాదంతే..
ఎన్నాళ్లిలా ఏకాకిలా ఉంటాడో ఏమో తెలీదే...
విరక్తి చెందే వయస్సు కాదే పైలా పచ్చీసే..
తపస్సు చేసే తలంపు లేదే హుషారైన ఫేసే..
ఏతావాతా తేలేదేమిటి ఎలాంటి తేడా లేదే..
ప్రేమా భామా అనేవి మాత్రం చెవిలో పడరాదంతే..
ఎన్నాళ్లిలా ఏకాకిలా ఉంటాడో ఏమో తెలీదే...
కలిసి ఎంత దూరం ప్రయాణం చేసినా, ఒక మాటా ఉండదు ముచ్చట ఉండదు. తనేమీ చెప్పడు, ఏం చెప్పినా వినడు. అంతలా చేసిన తప్పేంటా అని చూస్తే అమ్మాయిగా పుట్టడమేనా.? ఆ అమ్మాయితో స్నేహం చేస్తే మడిలో ఉన్న అతగాడు మైల పడతాడా..! తియ్యగా ఉండే చిరునవ్వు చేదుగా అనిపిస్తుందా అతనికి..!!
చరణం2
తనేమి అనడూ అనేది వినడూ ఏం మనిషో గానీ..
అదో విధంగా అమాయకంగా చూస్తాడెందుకనీ..
అమ్మాయిగ జన్మించడమేనా నే చేసిన అపచారం..
మగ పుట్టుక మడి చెడిపోతుందా నాతో చేస్తే స్నేహం..
నే నవ్వితే చిరు చేదుగా ఉందేమో పాపం తనకీ..
తనేమి అనడూ అనేది వినడూ ఏం మనిషో గానీ..
అదో విధంగా అమాయకంగా చూస్తాడెందుకనీ..
అమ్మాయిగ జన్మించడమేనా నే చేసిన అపచారం..
మగ పుట్టుక మడి చెడిపోతుందా నాతో చేస్తే స్నేహం..
నే నవ్వితే చిరు చేదుగా ఉందేమో పాపం తనకీ..
చిన్న చిన్న పదాలు. గొప్పగా అర్థాలు, అంతరార్థాలు కూడా ఏమీ లేవు. కానీ నాకు మాత్రం భలే నచ్చాయి ఈ పాటలో వాడిన పదాలు. సినిమా అయితే నేను చూడలేదు. యూ ట్యూబ్ లింక్ కూడా దొరకలేదు..:( సినిమా అంతా చూసే సమయం లేక, ఆన్లైన్ మూవీలో ఈ పాట మాత్రమే చూసాను. వాళ్లిద్దరి హావభావాలు తప్పించి మిగిలినదంతా చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ఆ లొకేషన్స్ భలే ఉన్నాయి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ పాటకి స్వరాన్నందించిన హంసిక అయ్యర్ గొంతు చాలా బాగుంది. కానీ ఇంకాస్త తెలుగు వచ్చుంటే ఇంకా బగుండేది అనిపించింది.
డౌన్‌లోడ్ చేసుకుని వినాలనుకుంటే ఇక్కడ నొక్కండి.
ఆన్‌లైన్ వినాలనుకుంటే ఇక్కడ నొక్కండి.
4 comments:
పాట బావుంది అపర్ణ ..గురువు గారు కేక
"కప్పు కాఫీకి సిద్ధమా..!!"
నేను కాఫీ తాగను
ఐక్య మత్యం వర్ధిల్లాలి ..
మీ ఊర్లో ఉన్న ఆ బర్రె భలే ఉంది ఈ సారి వెళ్ళినప్పుడు ఫోటో తీసుకొని బ్లాగులో పెట్టవా
ప్రవరాఖ్యుడు..బాబోయ్ జగపతిబాబా ? నేను జంప్
బావుందండీ. పాట విన్నాక నచ్చిందీ నాకు. ఈ పాట పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
పాట వినలేదు కాని నీ పోస్టు లో చదివితే బాగుంది :)
ఇందులో నాకు ఇంకో పాట ఇష్టం .. దాని మీద పోస్ట్ రాద్దాం అనుకుంటున్నా :) నీ ఇన్స్పిరేషన్ తో రచయిత్రి గారు
ఇప్పుడే చూశానండీ ఈ టపా..
నాకు బాగా నచ్చుతుందీపాట, నేను సినేమా చూశాను, ఓకె..
శ్రీకారం చుడుతున్నట్టు అని ఇంకోపాట కూడ బాగుంటుంది ఈ సినెమాలో, SPB భళే పాడాడు.
Post a Comment