Monday, July 5, 2010

ఆరాటపు తడిగానం

ఆకాశానికి పుడమి తల్లి ప్రేమలేఖ ఆహ్వానం, భూదేవికి అంబరం పంపే ఆరాటపు తడిగానం. ప్రేమకు ఇంత కన్నా గొప్ప నిర్వచనం ఉండదేమో. మరి సిరివెన్నెల గారా మజాకా..?? ఈ పాటికే మీకు అర్థం అయ్యే ఉంటుంది, నేను మాట్లాడేది నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం లోని "ఘల్ ఘల్" పాట గురించి అని. నాకు అనిపిస్తూ ఉంటుంది, అసలు ఈ ప్రపంచం లోని అన్ని భావాలని ఆయన గారు అర్ధం చేసేస్కుని ఇంత గొప్ప పాటలు రాసేస్తారా అని. లేకపోతే ఏంటండీ.. భక్తి, ఆరాధన, ప్రేమ, స్ఫూర్తి, కోపం, చిలిపి తనం.. ఇలా ఎన్నో భావాలని తన మాటలతో రక్తి కట్టించారు. ఇక ఈ ప్రేమ భావానికి వస్తే





ఘల్ ఘల్ ఘల్ ఘల్.. ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్..
ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే..
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనం లో వినిపించే తడి గానం ప్రేమంటే...
అణువణువును మీటే మమతల మౌనం పద పద మంటే నిలవదు ప్రాణం
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం..
దాహం లో మునిగిన చివురుకి చల్లని తన చెయ్యందించీ స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే..
మేఘం లో నిద్దుర పోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే.. ||ఘల్ ఘల్||



ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా..
ప్రణయం ఎవరి హృదయం లో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా..
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే..
అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం..
సరిగమ లెరుగని మధురిమ ప్రేమంటే..
దరి దాటి ఉరకలు వేసే ఏ నది కైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే..
సిరి పైరై ఎగిరే వరకూ చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే.. ||ఘల్ ఘల్||



మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే..
పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే..
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే..
తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే..
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా..
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రంతై ఎదురవదా.. ||ఘల్ ఘల్||





ఏం రాయాలండీ...? ఈ పాట వర్ణనకి నా మాటలు సరిపోతాయని నేననుకోను. కానీ ప్రయత్న లోపం ఉండకుండా, ఎదో ఉడతా భక్తి గా నాలుగు మాటలైనా మన సిరివెన్నెల గారిని పొగడకపోతే నా మనసు నన్ను క్షమించక పోవచ్చు. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఎంత మంచిగా పాటలు రాస్తే మాత్రం ఎన్ని సార్లని ఆయనకి పొగడ్తల మాల వేస్తాం..? కాకపోతే ఏమిటండీ..?
"ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే..
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనం లో వినిపించే తడి గానం ప్రేమంటే..."
ఈ పోలిక విన్న తర్వాత ఎవరికైనా ఏం చెయ్యాలనిపిస్తుంది..? వడగాలి వస్తే ఎదో మామూలు గాలే అనుకుని ఉండే దాన్ని ఈ పాట వినక ముందు. కాదట. అది ఆకాశానికి ఈ పుడమి తల్లి ప్రేమ సందేశం అట. ఆ వెంటనే పే..ద్ద వర్షం వస్తే అందులో తడుచుకుంటూ "వానా వానా వల్లప్పా.. " అని పాడుకోడం మాత్రమే తెలుసు. కానీ దానికి కూడా ఒక అర్థం ఉందట. అది మన పుడమి తల్లి ప్రేమలేఖ కి బదులు గా వినిపించే తడి గానం అట. ఇదేముంది..? ఇంకా ముందుంది చూడండి.
"దాహం లో మునిగిన చివురుకి చల్లని తన చెయ్యందించీ స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే..
మేఘం లో నిద్దుర పోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే.. "
మీరే చెప్పండి.. ఈ మనిషిని ఏమనాలి..? చివరికి ఒక విత్తు ని మొక్క గా మొలిపించే చి..న్న చినుకుది కూడా ప్రేమేనట. ఇక మన మాగాణి నేల లోగిలి లో కనిపించే రంగు రంగుల ముగ్గు కూడా ప్రేమేనట.ఇంకా చిత్రం.. ఆ రంగులన్నీ కూడా మన మేఘాల మాష్టారువే నట. అదేనండీ.. ఇంద్రధనుస్సు.




ఇన్ని రోజులూ జన్మదినం అంటే మనం ఈ భూమి మీదకి వచ్చిన రోజని మాత్రమే తెలుసండీ నాకు. ఇప్పుడేమో కొత్తగా ఈయన వచ్చి, ప్రాణం పుట్టిన రోజుని ఎవరైనా గుర్తించగలరా అని అడుగుతుంటే నేనేమని చెప్పాలి..? అలాగే ప్రణయం కూడా ఎవరి హృదయం లో ఎపుడు ఉదయిస్తుందో చెప్పలేమంట.. నిజమేనంటారా..? మరీ చోద్యం గా లేదూ..? చివరికి ప్రేమంటే నిర్వచించే పదానికి కూడా ప్రేమంటే ఎమిటో తెలియదంట. చరితలు, కవితలు, సరిగమలు వీటన్నిటికీ అతీతమైనదంట ప్రేమంటే.. ఏమిటో.. (ఒక్కసారి శుభలగ్నం లో ఆమని ని గుర్తు తెచ్చుకోండి.) ఏం చెప్తామండీ.. ఉరకలు వేసే నదికి ఆ ఉరవడి తెచ్చిన తొలి చినుకు ఏదంటే..! ఇక చేనుకు కూడా తెలియదట, తనలో నాటిన విత్తులు మొక్కలుగా మారి సిరి పైరు గా ఎదిగేంత వరకూ; తన లోని ఈ కొత్త కళకు తొలిపిలుపు గురించి.
మట్టి కి బంగారానికి తేడా తెలియాలంటే మండే కొలిమిని అడగాల్సిందేనట. బంగారం అని పిలిపించుకోవాలంటే బంగారానికి ఎంత కష్టమో కదా.. నాగలి పోటు చేసే మేలు గురించి నిజం తెలుసుకోవాలంటే పండే పొలాన్ని మాత్రమే అడగాలి. గెలుపంటే ఒక్కొక్కరూ ఒక్కో రకం గా నిర్వచిస్తారు. మన సిరివెన్నెల ఎమంటున్నారో తెలుసా.? శరీరం మొత్తం గాయలతో ఉన్నప్పుడు, ఆ గాయాలను కూడా వరమాల గా మార్చి వరించే ప్రియురాలట. ఇక వలపు సంగతి, మనసులకు తనంత తానే అడగక దొరికే వరమట. ఇక్కడో చిత్రం ఉందండీ.. అన్ని మనసులకూ కాదు. వలపు కొలువై ఉండే విలువ ఉండాలట.
"జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా.."
ఎన్ని అనుకున్నా ఈ వాక్యం దగ్గరికి వచ్చే సరికి సిరివెన్నెల గారిని పొగడకుండా ఉండలేకపోతున్నాను. నడకల్లో తడబాటు కూడా నాట్యం గా మారొచ్చు అన్న ఆలోచన మీకెప్పుడైనా వచ్చిందా..? నాకైతే ఎప్పుడూ రాలేదు.నీ అడుగుల్లో ఎప్పుడూ అడుగులు కలిపే వారుంటే అలాంటి తడబాటు కూడా నాట్యం అవుతుందట. ఇక ఏమంటామండీ ఆయన్ని..? నోరు కట్టి పడేశారు కదా..
ఎప్పటి లాగానే మీ సలహాల కోసం ఎదురు చూస్తూ..
మీ
అపర్ణ.


1 comments:




Viswa Ravi said...
chaaaaaala chakkaga vishleshinchaavu.. and u r correct.. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా. this is an amazing line.. ee song complete ga asalu mana sadharana alochanaki andani kavitvam... nenu kuda sirivennela gariki ekalavya sishyunni ani cheppi garvapadadaamanukune abhimaanini. nee analysis nenu oohinchaledu.. good going. keep it up.. :)

11 comments:

రాజ్ కుమార్ said...

జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా..
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రంతై ఎదురవదా..

వహ్ waah .. హాట్సాఫ్ to సిరివెన్నెల..
నా ఉద్దేశం ప్రకారం సిరివెన్నెల గారి పాటలు మనసుకి అర్ధం అవుతాయి. కాని మాటల్లో చెప్పడం చాలా కష్టం. మీ ప్రయత్నం అభినందనీయం.. :)

మనసు పలికే said...

>>నా ఉద్దేశం ప్రకారం సిరివెన్నెల గారి పాటలు మనసుకి అర్ధం అవుతాయి.
మీరు చెప్పింది అక్షరాలా నిజం వేణురాం గారు.. ఆయన మాటల్ని మనసు ఎంత బాగా అర్థం చేసుకోగలుగుతుందో, ఆ భావాల్ని అక్షర రూపంలో పెడదామంటే మనం అంతగా ఫెయిల్ అవుతాం..:( ఆ పాటలు వింటున్నప్పుడు కలిగే ఆనందాన్ని మాటల్లో ఎలా పెట్టాలో అర్థం కాదు.. అలా ఆనందానికి అక్షర రూపం ఇవ్వడానికి కూడా సీతారామ శాస్త్రి గారి దగ్గరికే వెళ్లాలనిపిస్తుంది నాకైతే..:)

ఆ.సౌమ్య said...

మనం మనం ఒకటి "సిరివెన్నెల ఫేన్స్ అసోసియేషన్ కి ప్రసిడెంటు, సెక్రటరీ మనిద్దరం కదా!


ఆయన గురించి కొత్తగా చెప్పేదేముంది....ఆయన తెలుగు సినిమాప్రపంచానికి "సిరి" వెన్నెల!

మనసు పలికే said...

>>మనం మనం ఒకటి "సిరివెన్నెల ఫేన్స్ అసోసియేషన్ కి ప్రసిడెంటు, సెక్రటరీ మనిద్దరం కదా!
హహ్హహ్హా.. సౌమ్య గారూ.. భలే భలే.. ఇదేదో బాగుంది. మనం ఇలాగే ఫిక్స్ అయిపోదాం. ధన్యవాదాలండీ వ్యాఖ్య పెట్టినందుకు..:)
>>ఆయన తెలుగు సినిమాప్రపంచానికి "సిరి" వెన్నెల!
200% correct..:)

ఆ.సౌమ్య said...

హిహిహి మనకి తోడు ఇంకోడున్నాడు, సాయి ప్రవీణ్ అని. అతను కూడా మనలాగే సిరివెన్నెలకి పేద్ద ఏసీ, సిరివెన్నెల పేరు మీద ఏకంగా ఒక బ్లాగే పెట్టేసాడు...ఇక్కడకి వస్తాడేమో చూద్దాం, వస్తే ఓ పోస్ట్ ఇచ్చేద్దామే :)

అన్నట్టు సిరివెన్నెల మీద నేను రాసిన పోస్ట్ చూసారా?

http://vivaha-bhojanambu.blogspot.com/2010/05/blog-post.html

మనసు పలికే said...

సౌమ్య గారు, ఎందుకు తెలియదూ.. సాయి ప్రవీణ్ గురించీ తెలుసు.. మీ టపా కూడా చదివేశానోచ్ ఎప్పుడో..:)
మీకు తెలుసా, మీరు మీ టపాలో పెట్టిన పాటలు కొన్ని సిరివెన్నెల రాశారని నాకు ఇంతకు ముందు తెలియదు..:) మీ టపా వల్ల నా లిస్ట్‌లో ఇంకొన్ని చేరాయి నా సిరివెన్నెల బ్లాగులో రాయాల్సినవి. బోల్డన్ని ధన్యవాదాలు మీకు..
సాయి ప్రవీణ్ కి కూడా ఇచ్చేద్దాం లెండి ఏదైనా పోస్ట్..:)

రాజ్ కుమార్ said...

సౌమ్య గారికి " సెక్రటరీ " అనే పదం అంటే ఎంతిష్టమో..? :) :)
మీరు మీరు కలిసిపోయి ఇన్ని కుట్రలు చేస్తారా?
ఇలా కాదు గాని.. నాకు కూడా ఒక పదవి గావాల.. ఏ పదవిస్తారో చెప్పనిDi ముందు..

మనసు పలికే said...

హహ్హహ్హా. వేణురాం గారు, నిజానికి నాకు మీరు కూడా గుర్తున్నారు సిరివెన్నెల ఫ్యాన్స్ లిస్ట్‌లో.. కానీ మీకు పదవులు గట్రా ఇష్టం ఉండవేమో అని మీ పేరు చెప్పలేదు..;)

హరే కృష్ణ said...

ఇక్కడ ఎవరు పదవుల కోసం కొట్టేసుకుంటున్నారు
నా మూడు లక్షలు నాకిస్తే నేను వెళ్ళిపోతా

మనసు పలికే said...

కృష్ణ వచ్చేశావా.. అసలు ఈ మూడు లక్షలకీ నీకూ ఏదో అవినాభావ సంబంధ ఉన్నట్లుంది కదూ.. ఎక్కడ ఏ డిస్కషన్ జరిగినా చక్కగా మూడు లక్షలతో ముడి పెట్టేస్తావ్.:))))

satya said...

రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రంతై ఎదురవదా..

inta kante goppaga evaru chepaleru...

GURUVU garu eeku paadabivandanalu