Friday, September 24, 2010

కరకు గర్జనల మేఘముల మేనికీ..

నాకు తెలిసి, తెలుగు మీద ఏ కొంచెం మమకారం ఉన్న వారి లిస్ట్ తీసినా ఈ పాటని ఇష్టపడని వారు ఉండరేమో.. తెలుగుదనం బ్రతికి ఉన్నంతవరకూ తెలుగు సాహిత్యాన్ని ఇష్టపడే వారికి ఈ పాట ఒక విందుభోజనమే.. అంతటి అందమైన అద్భుతమైన పాట ఇది.. ఏదా అని చూస్తున్నారా..? మన సీతారామ శాస్త్రిగారికి "సిరివెన్నెల" అని నామకరణం చేసిపెట్టిన చిత్రంలోని "ఆదిభిక్షువు వాడినేది కోరేదీ.."  నే చెప్పింది నిజమే కదా..:)

భక్తి అంటే కేవలం అర్చనలు, అభిషేకాలు, స్తోత్రాలేనా.? ఇవన్నీ అందుకుంటున్నప్పుడు భక్తులు నాలుగు మాటలు అన్నా పడాలేమో.. కానీ అదేంటో.. శివయ్యే అన్నిటికీ ముండుంటాడు.. వరాలిచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. తన అభయహస్తం తోనే తన నెత్తి మీదే కష్టాలు కొన్ని తెచ్చుకుంటాడు.. నిజమే భోళా శంకరుడు..:) అందుకే భక్తితో.. ప్రేమతో నాలుగు మాటలు అన్నా వరాల వర్షం కురిపిస్తాడు.:))
అందుకే.. అప్పుడెప్పుడో శ్రీనాధుడు ఆ శివయ్యని నానా మాటలు అనేసి వరాలు పొందేశాడు..
సిరిగల వానికి చెల్లును తరుణులు 
పదియారు వేల తగ పెండ్లాడన్
తిరుపమున కిద్దరాండ్రా పరమేశా
గంగ విడుము పార్వతి చాలున్ 

(ఈ పద్యంలో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్ద గలరు..)
పాపం.. శివయ్యకే అన్ని కష్టాలు కదూ.. ఇంతటితో ఊరుకుంటే ఏముంది..? ఇదిగో కింద ఉంది చూడండి.. మన సిరివెన్నెల ఎన్నెన్ని మాటలనేశారో ఆ శివయ్యని..


ఆది భిక్షువు వాడినేది కోరేదీ..
బూడిదిచ్చేవాడినేది అడిగేదీ..

ఏది కోరేది.. వాడినేది అడిగేదీ..(2)

తీపి రాగాల కోయిలమ్మకు
నల్ల రంగునలమిన వాడినేది కోరేది(2)
కరకు గర్జనల మేఘముల మేనికి
మెరుపు హంగు కూర్చిన
వాడినేది అడిగేదీ..
ఏది కోరేదీ వాడినేది అడిగేదీ..(2)

తేనెలొలికే పూల బాలలకు
మూణ్ణాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేదీ..(2)
బండ రాళ్లను చిరాయువుగ
జీవించమని
ఆనతిచ్చిన వాడినేది అడిగేదీ..
ఏది కోరేది వాడినేది అడిగేదీ..(2)

గిరిబాలతో తనకు కల్యాణమొనరింప
దరిజేరు మన్మధుని మసి జేసినాడు
వాడినేది కోరేదీ..
వర గర్వమున మూడు లోకాలు పీడింప
తలపోయు ధనుజులను కరుణించినాడూ..
వాడినేది అడిగేదీ...
ముఖ ప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు
వాడినేది కోరేదీ..
ముక్కంటి ముక్కోపి
ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడూ..




ఈ పాట గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది.. ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని ఎలా అందివ్వగలరో..!! ఈ పాట విన్నప్పుడల్లా, మనసు ఒక సంపూర్ణత్వాన్ని పొందిన భావన కలుగుతుంది. ఒక completeness, ఒక saturated feeling..  అలాంటి భావన. ఏమో మాటల్లో చెప్పలేక పోతున్నాను.. నా భావాన్ని చెప్పడానికి నాకు వచ్చిన భాష సరిపోవడం లేదు :(  భాషకందని భావం అంటే ఇదేనేమో.. లేదా.. నాకు వచ్చిన అతి కొంచెం భాష సరిపోవడం లేదేమో.. ఈ పాటకి నా మాటలు ఏమి జత చేసినా, అది పాట అందాన్ని తగ్గించడమే అవుతుంది.. అందుకే ఈ అందమైన భావాన్ని మనసులోనే దాచి పెట్టేసుకుందామని నిర్ణయించుకున్నాను.. :))


You Tube Link : http://www.youtube.com/watch?v=hRgJgo0hRMA
 

21 comments:

హరే కృష్ణ said...

Good one

శిశిర said...

భగవంతుడితో నువ్వు నావాడివి, నేను నిన్నేమైనా అడగగలను అన్నట్టు దబాయిస్తూ మాట్లాడడం. ఈ పాటలో భగవంతుడితో మనకి గల దగ్గరితనం కనిపిస్తుంది నాకు. అలా ఎందుకు చేశావు అని అడుగుతున్నట్టు. ఈ పాట విన్నప్పుడల్లా ఇంత చిన్నగా అంత పెద్ద భావాన్ని ఎలా చెప్పగలిగారా అనిపిస్తుంది. బాగుంది మీ టపా.

Raj said...

Same feeling as above :)

మనసు పలికే said...

కృష్ణ.. ధన్యవాదాలు..:)

శిశిర గారు, ధన్యవాదాలండీ టపా నచ్చినందుకు.
>>ఈ పాటలో భగవంతుడితో మనకి గల దగ్గరితనం కనిపిస్తుంది నాకు.
నాకు ఇలాంటి భావాన్నో ఎలా చెప్పాలో అర్థం కాలేదు..:)

రాజ్ గారు, ధన్యవాదాలు..:)

శే.సా said...

నాకు చాల ఇష్టం అయిన పాట అండి
గుర్తుచేసినందుకు నెనరులు.

ఏమి అడిగేది ఏమి కోరేది అంటూనే అన్ని అడిగేసారు అన్ని కోరేసారు శాస్త్రి గారు

ఆ.సౌమ్య said...

అద్భుతమైన పాటండీ. ఎంతో గొప్ప భావాలను, అంతే చక్కని తెలుగులో అమర్చారు సిరివెన్నెలగారు. one of my most favorite songs.
"తేనెలొలికే పూల బాలలకు
మూణ్ణాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేదీ..(2)
బండ రాళ్లను చిరాయువుగ
జీవించమని
ఆనతిచ్చిన వాడినేది అడిగేదీ.."....ఆహా ఎన్నిసార్లు విన్నా, తేనెలొలుకుతూనే ఉంటింది, ఒళ్ళు పులకిస్తుంది.

"Shivudu" said...

నేను మీతో ఏకీభవిస్తాను .. ఇది నాకు ప్రియమైన పాటల్లో ఒకటి.. అనిర్వచనీయమైన అనుభూతి .. సిరివెన్నెల కి జోహార్ ..
అదే కాదా.. ఆ భాష లోని సరళత.. చాల గొప్పగా ఉంటుంది..

durgeswara said...

nijamamdi seetaaraama saastrigaaru sivuni sannidhini anubhavistu vraasinatlumdi paata

Anonymous said...

శేషేంద్ర సాయి గారు, దానిభావం 'అన్నీకోరినట్టూ కాదు. ప్రాపంచికమైన కోర్కెలు అడిగేస్థితి దాటిపోయిన వాడి భక్తిభావన అనుకోవాలి.

Good post.

వేణూశ్రీకాంత్ said...

చాలా మంచి పాట గుర్తు చేశారు.

మనసు పలికే said...

శేషేంద్ర గారు.. ధన్యవాదాలు..:)

(ఆ.)సౌమ్య గారు ;),
>>ఆహా ఎన్నిసార్లు విన్నా, తేనెలొలుకుతూనే ఉంటింది, ఒళ్ళు పులకిస్తుంది.
అవునండీ.. అసలు నాకు ఈ పాటలో ఏ వాక్యాన్ని మొదట ఉంచాలి అన్న విషయం అర్థం కాలేదు.. అంతగొప్పగా ఉన్నాయి అన్ని వాక్యాలు, ఒకదానితో ఒకటి పోటీ పడుతూ..

శివుడు గారు, అవునండీ.. చాలా సరళమైన పదాలతో గొప్ప గొప్ప భావాలు పలికించగలరు..:)

దుర్గేశ్వర గారు, ఆయన రాసే అన్ని పాటలూ అంతే ఉంటాయండీ.. పాత్రల్లో, కథలో లీనమైపోయి రాస్తారు..

snkr గారు, ధన్యవాదాలు..:)

వేణు శ్రీకాంత్ గారు, ధన్యవాదాలు..:)

Sai Praveen said...

ఈ పాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్ని సార్లు విన్నా ఇంకా మధురంగానే ఉంటుంది. ఈ పాట పూర్తి సాహిత్యం నా టపాలో చూసే ఉంటావు.
http://saipraveen-telugu.blogspot.com/2010/06/3.html
ఇక ఆ పద్యం లో ఏమైనా తప్పులు ఉన్నాయో లేదో నాకు తెలియదు కాని, అది కంద పద్యం. పాదాల విభజన ఇలా ఉండాలి.

సిరిగల వానికి చెల్లును
తరుణులు పదియారు వేల తగ పెండ్లాడన్
తిరుపమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్

3g said...

Good Post. ఈ సినిమా లోనే ఇంకొక పాటుంటుంది కదా "విరించినై విరచించితిని...." అని ఈ పాటలో మాటలంటే నాకు చాలాఇష్టం వాటి అర్దాలు తెలియకపోయినా కూడా. ఈ మద్యనే ఒక బ్లాగులో ఈ పాట భావం వివరించడం చూసాను. నాకు మామూలుగా శివుడంటే ఇష్టం కాని ఆ పోస్ట్ చూసాక కొద్దిసేపు సీతారామశాస్త్రి శివుడికంటే గొప్పగా కనిపించాడు. ఇక్కడెవరైనా ఆ పోస్ట్ లింక్ ఇస్తే బాగుణ్ణు నేనది మిస్సయ్యాను.

@ప్రవీణ్: ఈ పాట పూర్తిసాహిత్యం మీరు రాసారు కదూ!! నిన్న అపర్ణ గారు ఈ పోస్ట్ వేసినప్పటినుండి మిగతా చరణాలకోసం వెతుకుతున్నాను. థేంక్స్.

శ్రీనివాస్ పప్పు said...

మరే భక్తులందరికీ భగవంతుడిమీద అధికారం ఉంటుందండీ,నా వాడనుకున్నవాడే అలా అడగ్గలడు కదా మరి.రామదాసు గారనలేదా రాముడ్ని నేను చేయించిన నగలేసుకుని ఊరేగుతూ మీ అబ్బ సొమ్ములా కుల్లుకుతున్నావని."ఎవడబ్బసొమ్మాని కులుకుతూ తిరిగేవూ రామచంద్రా అనేసి మళ్ళా ఈ దెబ్బాలకోర్వక అబ్బా తిట్టితినయ్యా ఆయాసపడబోకు అని అడిగేసాడు.అంతే అదే భక్తునికి భగవంతునికి ఉన్న అనుబంధం అర్ద్ధం చేసుకుంటే బోల్డంత ఉంటుంది.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

అపర్ణ గారూ! ఎవరికి నచ్చదు చెప్పండి ఈ పాట!
@ 3g,
మీరడిగిన టపా లంకె ఇదుగోండి.
http://manonetram.blogspot.com/2010/07/blog-post_10.html

బ్లాగు పేరు మనోనేత్రం.

మనసు పలికే said...

సాయి ప్రవీణ్ గారు, నేను మీ టపా ఇంతకు ముందే చూశాను.. కానీ నాకు అందులో చాలా వాటి అర్థాలు తెలియదు.. అందుకే మొత్తం పెట్టలేదు. నాకు తెలిసినంత వరకే పెట్టాను..:)))
కంద పద్యం అని చెప్పి పాద విభజన కరెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు..:)

3g గారు, నాకు కూడా విరించినై పాట చాలా ఇష్టం, కానీ అర్థం తెలియదు. కామెంటినందుకు ధన్యవాదాలు. మీరు చెప్పిన పోస్ట్ నేను చూడాలేదు ఇంకా.. మందాకిని గారు ఇచ్చారు కదా చూస్తాను నేను కూడా..:)

శ్రీనివాస్ గారు, నిజమేనండోయ్.. రామదాసు కూడా ఇదే దారి కదా ఫాలో అయింది..:) ధన్యవాదాలు..

మందాకిని గారు, ధన్యవాదాలండీ టపా పరిచయం చేసినందుకు..:)

3g said...

@mandakini garu: Thank u very much, this is the post exactly what I was searching, thanks.

రాజ్ కుమార్ said...

adbhutamaina paata andinchaaru...
krutajnatalu..:)

మధురవాణి said...

My all time favourite song! :)

మనసు పలికే said...

మధుర గారు.. నాక్కూడా..:) ధన్యవాదాలు వ్యాఖ్య పెట్టినందుకు..

సవ్వడి said...

naaku kudaa ee paata caalaa ishtam...