Friday, December 31, 2010

మనకొద్దీ చెంచాడు కష్టాలు

"అయ్యోలూ..అమ్మోలూ.. ఇంతేనా బ్రతుకు హో హో హో." మీకందరికీ జెమిని టి.వి. లో వచ్చే అమృతం సీరియల్ కోసం సిరివెన్నెల గారు రాసిన ఈ పాట తెలిసే ఉంటుంది. కారణం తెలియదు కానీ, ఈ పాట వినగానే అప్రయత్నంగా నాకు  ఒక కథ గుర్తొస్తుంది. ఈ పాట వింటే ఎంత నవ్వొస్తుందో, ఆ కథ వింటే అంత ఉద్వేగం ఆవహిస్తుంది. ఈ పాట గురించిన ఆలోచన వచ్చినప్పుడల్లా రెండు విరుద్ధమైన భావాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాను. అందుకే ఇక్కడ హాస్యపూరితమైన వ్యాఖ్యానం, మనసు పలికే బ్లాగులో ఉద్వేగభరితమైన కథనం.
 
ఎప్పుడూ కష్టాలే ఉంటాయా మన జీవితాల్లో, నవ్వుల పువ్వులు కూడా పూస్తున్నాయి సరిగ్గా చూడు అంటూ సున్నితమైన హాస్యంతో చెప్పారు. జీవితాన్ని ఒక టి.వి. గా తీసుకుంటే మన మనసనే రెమోట్ కంట్రోల్ మన చేతుల్లోనే ఉంటుందని, ఏడుపుగొట్టు ఆలోచనల్ని రానివ్వకుండా మనమే చూసుకోవచ్చని ఎంత బాగా చెప్పారో. హహ్హ.. చివరికి మనం లోతైన ఊబిలా భావించే కష్టాల్ని చిలిపి కష్టాలు అని తేల్చేసి వార్తల్లో హెడ్‌లైన్స్ తో పోల్చేసారు. నాకు తెలుసు ఇది ధారుణమే అని. మరే.. మనకే బోలెడన్ని కష్టాలు ఉన్నట్లు మనం తెగ ఫీల్ అయిపోయి సంతోషంగా ఏడ్చేస్తూ ఉంటామా.. ఇప్పుడేమో ఈయనగారు ఇలా వచ్చేసి కొత్తగా "కష్టాలు అన్నీ సిల్లీగానే ఉంటాయి" అంటే ఏమనుకోవాలి.? అసలు బాధల్లో తీవ్రంగా లీనమైపోయి గుండెలవిసేలా ఏడవడం ఎంత బాగుంటుందనీ.. ఆ ఆనందం ఈయనకెలా తెలుస్తుంది..? ఇంకా చూడండి.. మన గుండెలకి లోతుగా తగిలే గాయాలు అయొడిన్‌తో మానిపోయేవట. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా..?
       అయ్యోలూ అమ్మోలూ ఇంతేనా బ్రతుకు హో హో హో
       ఆహాలూ ఓహోలూ ఉంటాయి వెతుకు హా హా హా
       మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోలు?
       ఇట్టే మార్చేద్దాము ఏడుపుగొట్టు ప్రోగ్రాంలు!
       వార్తల్లో హెడ్లైన్సా మనకొచ్చే చిలిపి కష్టాలు?
       అయొడిన్‌తో అయిపోయే గాయాలే మనకు గండాలు

ఇంకా చూడండి. మన మీద ఎంతో ప్రేమతో మనతో ఉండిపోడానికి వచ్చింది ఈ ట్రబుల్ అని ఎంతో ఆనందిస్తూ ఉంటామా. కాదట. ఎక్కడికో వెళుతూ ఉంటే దారిలో కనిపించి "హెల్లో హౌ డు యు డు" అని మాత్రమే అడుగుతుండట. జీవితాంతం మనం కష్టాల్ని సంతోషంగా అనుభవించడానికి, ఆతిథ్యం ఇస్తా అన్నా కూడా మనతో ఉండదట. ట్రబుల్ ఏమైనా పనీ పాటా లేకుండా గాలికి తిరుగుతూ ఉంటుందా తీరిగ్గా మనతో కాలక్షేపం చెయ్యడానికి అని కొశ్చను:(. మనసు చివుక్కుమనదూ..!! ఇరుకు అద్దెల్లు ఉన్నందుకు మనమంతా ఆనందంగా బాధ పడుతూ ఉంటే ఈయనేంటండీ, గాలికి కూడా స్థానం లేని ఇంట్లో పెను తుఫాను అడుగు ఎలా పెడుతుందని అంటారు..?
       ఎటో వెళ్ళిపోతూ నిను చూసింది అనుకోవొయ్ ట్రబులు
       “హలో హౌ డు యూ డూ” అని అంటోంది అంతే నీ లెవెలు
       ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా
       తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా
       గాలైనా రాదయ్యా నీదసలే ఇరుకు అద్దిల్లు
       కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెను తుఫానసలు?

చూసారా చూసారా మళ్లీ అదే మాట. అంతు లేకుండా ముక్కు చీదుకుంటూ మనం అనుభవించే కష్టాలు చెంచాడేనా..? పైగా ఆ మాత్రం కష్టాలకి ఆయాసం వద్దని హితబోధ ఒకటి. తిప్పి తిప్పి కొడితే కరెంటు, రెంటే మన కష్టాలట. ఏడ్చీ ఏడ్చీ తెచ్చుకునే కన్నీళ్లు కూరలో కారం ఎక్కువైనందుకట. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా మీరే చెప్పండి. మనం చేసే ఫైటింగంటే దోమల్తో చేసేదేనా.? ఎంత అవమానం. ఈ అవమానం మనకి కాదు, మనం ఎంతో ప్రేమగా బాధ్యతగా ఎప్పుడూ మన వెన్నంటే ఉంచుకునే మన కష్టాలకి, కన్నీళ్లకీనూ..
       ఒరేయ్ ఆంజనేయ్లూ! తెగ ఆయస పడిపోకు చాలు
       మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు
       కరెంటూ రెంటూ ఎట్సెట్రా మన కష్టాలు
       కర్రీలో కారం ఎక్కువ ఐతే కన్నీళ్ళు
       నైటంతా దోమల్తో ఫైటింగే మనకి గ్లోబల్ వార్!
       భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడకు గోలీ మార్!

అసలవి లేకుండా మన రోజు గడుస్తుందా అంట. అటువంటి కష్టాలు, కన్నీళ్ళకి మనం ఎంత పెద్ద పీట వేయాలి! ఇలా అవమానించి సాగనంపితే మళ్లీ మనకి హెల్లో చెప్పడానికి అయినా వస్తాయా అసలు. ఇక మనం ఏడ్చేదెలా.. కన్నీళ్లు పెట్టుకునేదెలా చెప్మా..!!
ఏదేమైనా కొత్త సంవత్సరం వచ్చేస్తుంది కదా.. మీకు ఇలాంటి చిలిపి కష్టాలు, చెంచాడు కష్టాలు దరిదాపుల్లోకి కూడా రావొద్దని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Youtube Link : http://www.youtube.com/watch?v=cPu0_Q19UGc

15 comments:

ఆ.సౌమ్య said...

నాకు చాల ఇష్టమైన పాట ఇది.

ముఖ్యంగా ఈ లైన్లు....
ఒరేయ్ ఆంజనేయ్లూ! తెగ ఆయస పడిపోకు చాలు
మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు
కరెంటూ రెంటూ ఎట్సెట్రా మన కష్టాలు
కర్రీలో కారం ఎక్కువ ఐతే కన్నీళ్ళు
నైటంతా దోమల్తో ఫైటింగే మనకి గ్లోబల్ వార్!
భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడకు గోలీ మార్!

మంచి పాట గుర్తు చేసారు thanks!

3g said...

ఈ పాట వినేవాణ్ణిగాని ఇంత డీప్ గా ఆలోచించలేదెప్పుడూ. ’ఎప్పట్లాగే’ బాగుందని చెప్పలేను. కొత్త స్టైల్ బాగుంది.

jaggampeta said...

నూతన సంవత్సరం లో మీరు ,మీ కుటుంబం ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ....మల్లిశ్రీ

వేణూ శ్రీకాంత్ said...

నేను తరచుగా వినే పాటల్లో ఇది కూడా ఒకటి.. బాగా రాశారు :-)

వేణూరాం said...

ఎంత బోర్ కొట్టినా... మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా... "ఎప్పటి లాగానే బాగుంది.."
జయహో సిరివిన్నెల...:) అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..

kiran said...

@అపర్ణ - నాకు ఈ పాట అంటే చాల ఇష్టం కానీ సిరి వెన్నల గారు రాసారు అని ఈ రోజే తెల్సింది.. :)
అవును...చిన్న చిన్న వాటినపెద్దవి గ చూస్కొని ఏడవటం మన మానవ నైజం.. :)
మళ్ళి గుర్తు చేసినందుకు...స్వీట్ గ explain చేసినందుకు థాంక్స్.. :)

ప్రణవ్ said...

"మనం ఈదుతున్న ఒక చెంచాడు భవ సాగరాలు..."
ఐ లవ్ థిస్ సాంగ్! కానీ ఇది సిరివెన్నెల గారు రాసారని మాత్రం తెలీదండి.
అప్పట్లో ప్రతి వారం చూసేవాడిని. ఇప్పుడు టీవీ చూడడమే మానేసాను.
అసలు ఆ సీరియల్ ఇప్పుడు వస్తుందో లేదో కూడా తెలియదు :)
Really nice one. Thanks for reminding :)

మనసు పలికే said...

సౌమ్య గారు, ధన్యవాదాలు:)

3g గారు, ఇప్పుడైనా వినండి సర్, డీప్ గా:)) ధన్యవాదాలు..

జగ్గంపేట గారు, ధన్యవాదాలండీ, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

వేణు శ్రీకాంత్ గారు ధన్యవాదాలు:)

మనసు పలికే said...

వేణూరాం, ఎంత బోర్ కొట్టినా మళ్లీ మళ్లీ అదే చెబుతున్నా. ధన్యవాదాలు ;)

కిరణ్,
>>చిన్న చిన్న వాటినపెద్దవి గ చూస్కొని ఏడవటం మన మానవ నైజం.. :)
బాగా చెప్పావు:) ధన్యవాదాలు నీ వ్యాఖ్యకి:)

ప్రణవ్ గారు, మీకు కూడా తెలీదా ఇది సిరివెన్నెల గారి పాట అని.. ఒకప్పుడు నేను కూడా చూసేదాన్ని సీరియల్, ఇప్పుడూ మాత్రం అసలు టి.వి దగ్గరకే వెళ్లను.. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి:)

నేస్తం said...

నా విషయం లో ఈ పాట వెనుక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది అప్పు.. బాబు గాడు కడుపులో ఉన్నాడు..అమృతం సీరియల్ వస్తుంది..బాగా నవ్వాను ..నవ్వినపుడు బాగా కదిలాను.. అప్పుడే కొద్దిగా భయం వేసింది ..8 నెల.. మరుసటి రోజు ప్రోబ్లెం ..ఆపరేషన్ చేసేయాలన్నారు..అదో పెద్ద కధలే..అప్పుడు ఈ పాటే గుర్తువచ్చింది .. దేవుడి దయవల్ల సుఖాంతం అనుకో ..కాని ఈ పాట వింటున్నపుడలా అదే గుర్తొస్తుంది :)

Geetika said...

హాయ్ అపర్ణా...

ఇప్పుడే చూస్తున్నాను నీ పోస్ట్ ని. ఈ పాట వ్రాసింది సిరివెన్నెల గారా...!!!!!

నాకు తెలీదు. ఆ పాట పల్లవి తెలుసుగానీ మొత్తం వినలేదు ఎప్పుడూ.

ఇప్పుడు చదివాక అనిపించింది మంచి పాట మిస్సయ్యానని.

ఇంత ఎక్స్లెంట్ పాటని మొత్తం ఇచ్చినందుకు ధన్యవాదాలు...

మనసు పలికే said...

బాబోయ్..:( అక్కయ్యా మీ వ్యాఖ్య చదివి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. నో కామెంట్స్.. ఊహకే భయంగా ఉంది:(

హాయ్ గీతిక, ధన్యవాదాలు టపా నచ్చినందుకు.

Srini said...

చాలా బాగుంది... ఏదో టీవీ సీరియల్ సాంగ్ బాగుందని విన్నాను అంతేగానీ ఇంత లోతుగా అర్ధం చేసుకోలేదు ఇప్పటిదాకా... థాంక్ యు సో ముచ్...

నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

మనసు పలికే said...

శ్రీని గారు, ధన్యవాదాలు టపా నచ్చినందుకు:)

Arun Kumar said...

మంచి పాట గుర్తు చేసారు thanks!